American President : జో బైడెన్‌కు కోవిడ్-19 పాజిటివ్

ABN , First Publish Date - 2022-07-22T02:08:03+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు కోవిడ్-19 సోకింది. ఆయనకు

American President : జో బైడెన్‌కు కోవిడ్-19 పాజిటివ్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు కోవిడ్-19 సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గురువారం వైట్ హౌస్ (White House) ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఫ్ఫైజర్ ఇంక్‌కు చెందిన పాక్స్‌లోవిడ్ (Paxlovid) చికిత్స పొందుతున్నట్లు వివరించింది. 


వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్-పియర్రే విడుదల చేసిన ప్రకటనలో, జో బైడెన్ (79)కి స్వల్పంగా కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆయన Pfizer Inc.’s Paxlovid చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆయన వైట్ హౌస్‌లో ఐసొలేషన్‌లో ఉంటారని, అయితే తన విధులను కొనసాగిస్తారని చెప్పారు. వైట్ హౌస్ సిబ్బందితో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నారన్నారు. ఆయన పాల్గొనవలసిన సమావేశాల్లో తన నివాసం నుంచి ఫోన్, జూమ్ ద్వారా పాల్గొంటారన్నారు. 


జో బైడెన్ ఇటీవల సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌లలో పర్యటించారు. బుధవారం ఆయన మసాచుసెట్స్‌లో పర్యటించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ అమలు గురించి మాట్లాడారు. గన్ సేఫ్టీ, నేరాలపై పెన్సిల్వేనియాలో గురువారం ప్రసంగించవలసి ఉంది. 


ఇదిలావుండగా, జో బైడెన్‌కు పూర్తిగా టీకాకరణ (fully vaccinated) జరిగింది. అంతేకాకుండా రెండు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని రోజూ తెలియజేస్తామని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది. జో బైడెన్ సతీమణి జిల్‌కు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపింది.


Updated Date - 2022-07-22T02:08:03+05:30 IST