నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:25:05+05:30 IST

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ నాయకుల ధర్నా

ఇబ్రహీంపట్నం/చేవెళ్ల/షాబాద్‌/కొత్తూర్‌, మే 27: పెంచిన నిత్యావసర ధరలను ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశా యి. శుక్రవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాల యం వద్ద సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పెట్రోల్‌, డీజిల్‌లపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులన్నీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎల్పీజీ ధరలు తగ్గించాలని, రేషన్‌ షాపుల్లో 14రకాల సరుకులను పంపిణీ చేయాలన్నారు. స్టీల్‌, సిమెంట్‌ ధరలను అదుపు చేయాలన్నారు. విద్యుత్‌ చార్జీలు, భూముల రిజిస్త్రేషన్‌ చార్జీలను తగ్గించాల డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, లక్ష్మయ్య, సీహెచ్‌.జంగయ్య, సామేల్‌, ఎ.వెంకటేష్‌, శ్రీశైలం,మలుగు నర్సింహ, రాజు, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలవల్లే వస్తువుల ధరలు భారీగా పెరిగాయని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఇ.గాలయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బి.రాములయ్య అన్నారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడంతోనే నిత్యావసర సరుకుల ధరలూ పెరిగాయన్నారు. యూటీఎఫ్‌ కల్పన, గోపాల్‌, జగన్నాథశర్మ, కిషన్‌చౌహాన్‌, బుగ్గరాములు, వెంకటేష్‌ పాల్గొన్నారు. ధరలు తగ్గించే వరుకు ప్రభుత్వాలపై పోరాటం చే స్తామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి, ప్రభులింగం అన్నారు. చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఎం.సత్తిరెడ్డి ఆధ్వర్యంలో డీటీ రాజశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ధరల పెరుగులతో పేదలు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్‌, సుభాన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లేశ్‌, కృష్ణచారి, శివ, అబ్దుల్‌, అంజిరెడ్డి, మం జుల, మాధవి, యాదమ్మ, చంద్రకళ, మీనాక్షి పాల్గొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం అన్ని రకా ల పన్నులు రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య అన్నారు. షాబాద్‌లో డీటీ క్రాంతికిరణ్‌కు వినతిప్రతం అందజేశారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు, దుస్తులు, చెప్పులపై జీఎస్టీ తగ్గించి, స్టీల్‌, సిమెంట్‌, ఇసుక ధరలు తగ్గించాలన్నారు. ఆందోళన కార్యక్ర మంలో సీపీఐ మండల కార్యదర్శి రఘురాం, రాములు, నారాయణ, మధు, రుక్కయ్య పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువుల ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.పర్వతాలు అన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నాయకులు కొత్తూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి, తహసీల్దార్‌ రాములుకు వినతిపత్రం అందజేశారు. మండల కార్యదర్శి షకీల్‌, శేఖర్‌రెడ్డి, ఎల్లయ్య, శంకర్‌, మైసయ్య, రాములు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:25:05+05:30 IST