మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-25T06:57:50+05:30 IST

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వాటి పరిష్కారం కోసం జూలై 4న ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చే యాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి కోరారు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి
సంతకాలు సేకరిస్తున్న వరలక్ష్మి

మిర్యాలగూడ, జూన 24: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వాటి పరిష్కారం కోసం జూలై 4న ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చే యాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి కోరారు. శుక్రవారం పట్టణంలోని బంగారుగడ్డలో ఐద్వా నాయకులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు నెలలుగా ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమస్యలపై సర్వే చేసినట్లు తెలిపారు. ప్రధానంగా  రేషనకార్డులు, పిం ఛన్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు తదితర స మస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు క ట్టించామని ప్రభుత్వం చెబుతున్నా ఇళ్లకోసం లక్షల సంఖ్యలో పేద లు దరఖాస్తు చేసుకుంటే వేలల్లో కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద జూలై 4న తలపెట్టిన ధర్నాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు జానమ్మ, కృష్ణవేణి, సరిత, మంగమ్మ, ఎల్లమ్మ, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-25T06:57:50+05:30 IST