హోలియ దాసరి కులస్థుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-27T07:30:06+05:30 IST
హోలియ దాసరి కులస్థుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్ కోరారు. ఈ మేరకు పలువురు నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో గురువారం కలిసి వినతిపత్రం చేశారు.
బీబీనగర్, మే 26: హోలియ దాసరి కులస్థుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్ కోరారు. ఈ మేరకు పలువురు నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో గురువారం కలిసి వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆర్డీవో/ తహసీల్దార్ మంజూరు చేసేలా చొరవ చూపాలని, కుల సంఘం భవ నం నిర్మించాలని, హోలియ దాసరి కళాకారులకు పింఛన్ల మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హోలియ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్ల రమేష్, రేండ్ల శంకర్ తదితరులు ఉన్నారు.