రెవెన్యూలో బది‘లీలలు’

ABN , First Publish Date - 2022-07-01T05:29:31+05:30 IST

రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో పాటు మరికొన్ని పోస్టులకు సంబంధించి కోరుకున్న చోట బదిలీ కోసం కొంతమంది ఉద్యోగులు పైరవీలు సాగిస్తున్నారు. బదిలీల ప్రక్రియ జూన్‌ 30వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాజకీయ జోక్యంతో రెవెన్యూశాఖలో బదిలీల ప్రక్రియ జాప్యమవుతోంది.

రెవెన్యూలో బది‘లీలలు’

కొనసాగుతున్న కసరత్తు
రాజకీయ ప్రమేయంతో ఖరారు కాని తుదిజాబితా
నచ్చిన చోటు కోసం పైరవీలు
మొత్తం 402 మందికి స్థానచలనం!
(కలెక్టరేట్‌)

రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో పాటు మరికొన్ని పోస్టులకు సంబంధించి కోరుకున్న చోట బదిలీ కోసం కొంతమంది ఉద్యోగులు పైరవీలు సాగిస్తున్నారు. బదిలీల ప్రక్రియ జూన్‌ 30వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాజకీయ జోక్యంతో రెవెన్యూశాఖలో బదిలీల ప్రక్రియ జాప్యమవుతోంది. అనుకూలమైన వారికి తమ మండలాల్లో స్థానం కల్పించే విధంగా కొంతమంది అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఉద్యోగులు తమకు నచ్చిన స్థానానికి బదిలీ చేసుకునేలా.. అధికారపార్టీ నాయకులతో బేరసారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బదిలీ జాబితా ఖరారైనా.. గురువారం అర్ధరాత్రి వరకు ప్రకటించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 20 మంది తహసీల్దార్లకు, 48 మంది డిప్యూటీ తహసీల్దార్లకు బదిలీ జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. 70 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు(ఆర్‌.ఐ),  20 మంది అసిస్టెంట్లు, 240 మంది గ్రామరెవెన్యూ అధికారులు, ముగ్గురు టైపిస్టులు, ఒక ఆఫీస్‌ సబార్డినేటర్‌.. బదిలీల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో అన్ని విభాగాలకు సంబంధించి 420 మంది బదిలీ కానున్నారని.. ఈ మేరకు తుది జాబితా ఖరారైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నేతల ఒత్తిడి కారణంగా సకాలంలో తుదిజాబితాను ప్రకటించలేదు. శుక్ర, శనివారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. బదిలీల ప్రక్రియ పూర్తయినా.. స్థానాలకు సంబంధించి జాబితా మరింత జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.  



Updated Date - 2022-07-01T05:29:31+05:30 IST