సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాం

ABN , First Publish Date - 2022-05-26T03:56:10+05:30 IST

సింగరేణి ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాల క్రమబద్ధీకరణతో లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయదేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్‌ ప్రగతి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, కలెక్టర్‌ భారతి హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జీఎం సంజీవరెడ్డితో కలిసి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి మాట్లాడుతూ 2018లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ హామీని నెరవేర్చామన్నారు.

సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నస్పూర్‌, మే 25: సింగరేణి ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాల క్రమబద్ధీకరణతో లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయదేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్‌ ప్రగతి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, కలెక్టర్‌ భారతి హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జీఎం సంజీవరెడ్డితో కలిసి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి మాట్లాడుతూ 2018లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ హామీని నెరవేర్చామన్నారు. శ్రీరాంపూర్‌లో  176 ఎకరాల  విస్తీర్ణంలో  2843 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ లక్ష్యం కాగా తొలి విడతగా 953 మందికి ఇస్తున్నామన్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారులకు భూమిపై పూర్తి హక్కులు ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎలాంటి ధళారీ వ్యవస్థ లేకుండా శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే  6, అరుణక్కనగర్‌, సుందరయ్య కాలనీ వాసులకు పట్టాలు అందించామన్నారు. ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే సుమన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వైపు ఉంటుందని, పట్టాలు పొందిన వారికి అన్ని హక్కులు  ఉంటాయన్నారు.  ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, దీనిని చూసి ఓర్వలేని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు  లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు.  జిల్లా అభివృద్ధికి సహకరించాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలో, ఇతర రాష్ట్రా లకు ఆదర్శంగా ముందుకు సాగేందుకు తోడ్పాటు అందిం చాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు అందజే శారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకటరావు, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, ఎమ్మెల్యే తన యుడు విజిత్‌రావు, ఆర్‌డీవో వేణు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూమేష్‌, టీబీజీకేఎస్‌ నాయకులు సురేందర్‌రెడ్డి, అన్నయ్య, ఏనుగు రవిందర్‌రెడ్డి, మల్లారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగం, అధికారులు పాల్గొన్నారు.  

మందమర్రి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అందరూ సద్వినియోగ పర్చుకోవాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జీవో నంబరు 76లో సింగరేణి పరిధిలో అన్యాక్రాంతమైన భూమిలో ఇండ్లు కట్టుకున్న 1475 మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. బుధవారం రాత్రి 16 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా, మిగతా వారికి గురువారం మున్సిపాలిటీ పరిధిలో 7 ఏరియాలలో పంపిణీ చేస్తారని తెలిపారు. లబ్ధిదారులు తొందరలో డీడీలు కట్టి వారి పేరుపై పట్టాలు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ రామకృష్ణాపూర్‌ గడ్డ ఉద్యమాల గడ్డ అని, ఇక్క డ నుండే అనేక మంది నాయకులయ్యారని, గతంలో ఇక్కడ అనేక మంది నివసించేవారని, గత పాలకుల నిర్లక్ష్యం క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీకి శాపంగా మారిందన్నారు. రానున్న రోజు లలో రామకృష్ణాపూర్‌ పట్టణాన్ని నవీన రామకృష్ణాపూర్‌గా తీర్చిదిద్దుతానన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, కమిషనర్‌ వెంకటనారాయణ, వైస్‌ చైర్మన్‌ విద్యాసాగర్‌ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-26T03:56:10+05:30 IST