హామీపై మాట తప్పారు

ABN , First Publish Date - 2022-06-30T05:00:11+05:30 IST

ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న ఇప్ప టి సీఎం జగన్మోహన్‌రెడ్డి, పాత పట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2013 భూ సేకరణ చట్టం అమలు చేస్తామని వంశధార నిర్వాసితులకు హామీ ఇచ్చి ఇప్పుడు దానిని తుంగలో తొక్కి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం వారు నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హామీపై మాట తప్పారు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి

మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి
హిరమండలం: ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న ఇప్ప టి సీఎం జగన్మోహన్‌రెడ్డి, పాత పట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2013 భూ సేకరణ చట్టం అమలు చేస్తామని వంశధార నిర్వాసితులకు హామీ ఇచ్చి ఇప్పుడు దానిని తుంగలో తొక్కి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం వారు నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ కమ్యూ నిటీ హాల్‌లో వంశధార నిర్వాసితులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలంటే  ప్రతి ఎకరాకి రూ.19 లక్షల తో పాటు పీడీఎఫ్‌ ప్యాకేజికి రూ.13 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే వాటి నుంచి తప్పించుకునేందుకు కేవలం రూ.లక్ష చొప్పున మంజూరు చేసి మమ అనిపించేశారని విమర్శించారు. హామీని నిలబెట్టుకోలేనందున తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసి పి.బుచ్చి బాబు, నిర్వాసితులు చింతాడ గిరి, లంక రామారావు, పి.అప్పలనాయుడు, టి.రమేష్‌, ఎ.సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Updated Date - 2022-06-30T05:00:11+05:30 IST