రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2021-07-30T04:19:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఽగురువారం ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాఽథ్‌, కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు వెంకటరమణరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని, ఫసల్‌ భీమా యోజన పథకాన్ని అమలు పరచాలని, ఇటీవల కురిసిన వర్షాల తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
కలెక్టర్‌ కార్యాలయంలో దర్నా చేస్తున్న బిజెపి నాయకులు

ఏసీసీ, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఽగురువారం ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాఽథ్‌, కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు వెంకటరమణరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని,  ఫసల్‌ భీమా యోజన పథకాన్ని అమలు పరచాలని, ఇటీవల కురిసిన వర్షాల తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిర్మించి పది సంవత్సరాలు గడుస్తున్నా  నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని విమర్శించారు.  కలెక్టరేట్‌ ఏవో సురేష్‌ కు వినతిపత్రం అందజేశారు. జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పెద్దపల్లి పురుషోత్తం, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రావు, తిరుపతి, కిషన్‌, రాజయ్య, రమేష్‌ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే రాజీనామా చేయాలని రాస్తారోకో

నస్పూర్‌ : నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే దివాకర్‌రావు  రాజీనామా చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్‌ వద్ద  గురువారం  రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను  పోలీస్‌స్టేష న్‌కు తరలించి 14 మందిపై కేసు నమోదు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అగల్‌డ్యూటీ రాజు మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు విడుదల చేస్తున్నారని, హూజురాబాద్‌లో ఎన్నికలు జరుగనున్నందున అక్కడ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దివాకర్‌రావు రాజీనామా చేస్టే ఇక్కడ కూడా దళితబంధు అమలయ్యే అవకాశం ఉందన్నారు. వెంకటేశ్‌ గౌడ్‌, పిట్టల రవి, సత్రం రమేష్‌, సదానందం, వెంకటేశ్‌, పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T04:19:13+05:30 IST