ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-04-23T06:59:09+05:30 IST

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు, పోలీసులు, రైస్‌ మిల్లర్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులతో ఎస్పీ ఏవీ.రంగనాథ్‌తో కలిసి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌

అవకతవకలకు పాల్పడితే చర్యలు : ఎస్పీ

నల్లగొండ టౌన్‌, ఏప్రిల్‌ 22: ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు, పోలీసులు, రైస్‌ మిల్లర్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులతో ఎస్పీ ఏవీ.రంగనాథ్‌తో కలిసి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7లక్షల 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నారు. జిల్లా మిల్లులకు 5లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు సామర్ధ్యం ఉందన్నారు. 1లక్ష 20వేల మంది రైతుల నుంచి వరి కొనుగోలు చేశామన్నారు. తేమ శాతం, నాణ్యాత ప్రమాణాలను చూసి వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించాక వెంటనే కొనుగోలు చేసి ట్యాగ్‌ చేసిన మిల్లులకు రవాణా చేయాలన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా మిల్లర్లు అన్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. కొన్ని మిల్లులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షింది లేదనారు. ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ మాట్లాడుతూ, నాణ్యత, తాలు ఎక్కువగా ఉందన్న సాకుతో ఉద్దేశపూర్వకంగా కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు అవకతవకలకు పాల్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటుమని హెచ్చరించారు సమావేశంలో డీఆర్వో శేఖర్‌రెడ్డి, డీసీవో శ్రీధర్‌రెడ్డి, డీఎం నాగేశ్వర్‌ రావు, మార్కెటింగ్‌ ఏడీ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.


ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం

నల్లగొండ క్రైం: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ చిత్రపటానికి నల్లగొండ మండలంలోని జి.చెన్నారం గ్రామ సర్పంచ్‌ నూతల వెంకన్న ఆధ్వర్యంలో పలువురు రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ బృందం నేరుగా కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో తనిఖీలు చేస్తుండటంతో మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా ధాన్యం దిగుమతి చేకుంటున్నారని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. తనిఖీ బృందాలు వస్తున్నాయని తెలిసి మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఈ సందర్భంగా రైతులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-04-23T06:59:09+05:30 IST