ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-16T04:52:43+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన నర్సాపూర్‌ (జి), రాంపూర్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి


నర్సాపూర్‌(జి), మే 15 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన నర్సాపూర్‌ (జి), రాంపూర్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో క్విటాలుకు ఏ గ్రేడ్‌కు రూ.1960, బి గ్రేడ్‌కు రూ.1940 ప్రభుత్వం మద్దతు ధర  కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వసతి కల్పించాలన్నారు. ఆయన వెంట సివిల్‌ సప్లయ్‌ అధికారి సుధారాణి, నాయబ్‌ తహసీల్దార్‌ ముత్యం, గిర్దావర్‌ వేణుగోపాల్‌, నడిపోళ్ల రవి, రైతులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

దిలావర్‌పూర్‌, మే 15 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. ఆదివారం దిలావర్‌పూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కరీం, ఎంఆర్‌ఐ సంతోష్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-05-16T04:52:43+05:30 IST