పీవీ కుటుంబం దేశ సేవకే అంకితం

ABN , First Publish Date - 2021-01-17T05:51:01+05:30 IST

ప్రపంచంలో భారతదేశాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు కృషి చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావుతో పాటు ఆయన కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమయ్యారని రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

పీవీ కుటుంబం దేశ సేవకే అంకితం
వంగరలో పీవీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కెప్టెన్‌ లక్ష్మికాంతారావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, వినోద్‌కుమార్‌

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 

భీమదేవరపల్లి, జనవరి 16: ప్రపంచంలో భారతదేశాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు కృషి చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావుతో పాటు ఆయన కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమయ్యారని రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ ఇంటిని సందర్శించారు. పీవీ చిత్ర పటానికి నివాళులర్పించారు. వంగరలోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మికాంతారావు మాట్లాడుతూ పీవీ నర్సింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని కొనియాడారు.ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ శతజయంతి ఉత్స వాల సందర్భంగా వంగరలో రూ. పది కోట్ల నిధులను ప్రభు త్వం కేటాయించిందన్నారు. జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, కుమార్తె పీవీ వాణిదేవి, పీవీ మధన్‌మోహన్‌రావు, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, ఎంపీపీ జక్కుల అనిత పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:51:01+05:30 IST