ప్రశ్నించే గొంతుక చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2021-03-01T04:37:43+05:30 IST

నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి డా.సంపత్‌కుమార్‌ యువతకు పిలుపుని చ్చారు.

ప్రశ్నించే గొంతుక చిన్నారెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న చిన్నారెడ్డి

కొల్లాపూర్‌, ఫిబ్రవరి 28: నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి డా.సంపత్‌కుమార్‌ యువతకు పిలుపుని చ్చారు. కొల్లాపూర్‌ పట్టణంలోని మహబూబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాముయాదవ్‌ అధ్యక్షతన ఆదివారం ఎన్నికల సన్నాహక సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్‌ మాట్లాడారు. కొల్లాపూర్‌ కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖ ర్‌రెడ్డి సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం కోసం శిలా ఫలకం వేయగా, దానిని పూర్తి చేయడంలో పాలకులు విఫల మయ్యారన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు మల్లురవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాజకీయ లబ్ధి కోసమే మాజీ పధాని పీవీ నర్సింహారావు కుటుంబానికి ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించారన్నారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే బూటకపు హామీలు ఇచ్చిన కేసీఆర్‌ను నిలదీస్తా నని, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలపై పోరాడతానన్నారు. సమావేశంలో యువ జన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కేతూరి వెంకటేశ్‌, మల్లికార్జున్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్‌, జిల్లా డీసీసీ నాయకుడు లొంక హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్‌ అధ్యక్షుడు పరుశరాముడు, నగర అధ్యక్షుడు డీజే.ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:37:43+05:30 IST