Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..

Published: Fri, 22 Jul 2022 15:54:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..

వివాహమనేది జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే ఘట్టం. మరి అలాంటి పెళ్లి వేడుకను ఏదో.. జరిపించాం అన్నట్లుగా కాకుండా.. విందు, వినోదాలతో వినత్నంగా జరుపుకోవాలి. ఇందుకోసమే చాలా మంది వివాహ వేడులను విభిన్నంగా నిర్వహిస్తుంటారు. వేదికపైకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి కార్యక్రమంలో ప్రతి ఘట్టాన్ని సరికొత్తగా ప్లాన్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసిన వరుడు.. సిగ్గుతో దాన్ని కనిపించకుండా దాచేస్తాడు. అదే సమయంలో వధువు ఇచ్చిన రియాక్షన్.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. వేదికపైన వధూవరులు ఇద్దరూ పక్కపక్కన కూర్చుని, స్నేహితులను పలకరిస్తూ ఉంటారు. అదే సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా గిఫ్ట్‌లు అందజేస్తుంటారు. ఆ క్షణాలను ఆనందమయం చేయాలని వరుడి స్నేహితులు భావించారు. వెంటనే కవరులో ఓ గిఫ్ట్‌ను ప్యాక్ చేసి, వరుడికి అందజేస్తారు. తమ ముందే దాన్ని ఓపెన్ చేయాలని చెబుతారు. వరుడి పక్కనే ఉన్న వధువు.. ఓవైపు సిగ్గుపడుతూ, మరోవైపు ఆసక్తిగా గమనిస్తుంటుంది. కాసేపటికి వరుడు ఆ కవర్‌ను ఓపెన్ చేసి, అందులో చేయి పెట్టి చూస్తాడు. వెంటనే అందులో ఏమున్నదో తెలిసినట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. దీంతో అతడి స్నేహితులంతా పగలబడి నవ్వుతారు. అయితే ఆ వస్తువును బయటికి తీయకుండా, బలవంతంగా కుర్చీ కింద దాసేస్తాడు. మరోవైపు అందులో ఏముందో తెలిసినట్లుగా.. వధువు సిగ్గుపడుతూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే.. Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..videoబస్టాండ్‌లో ఉండగా లిప్‌స్టిక్‌ అడిగిన భార్య.. సరేనని షాపునకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్.. అసలు కథేంటంటే..రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!సెలవు రోజు కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన యువతి.. లోపలికి వెళ్లాక యజమాని ఒక్కడే ఉండడంతో షాక్.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.