నా భార్యను కిడ్నాప్ చేశారంటూ ఓ భర్త కేసు.. చివరగా ఇంట్లోనే ఆమె ఫోన్ స్విచాఫ్.. విచారణలో బయపటడిన ఘోరమిది..!

ABN , First Publish Date - 2022-01-29T00:03:53+05:30 IST

జనవరి 26వ తేదీన పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ సార్.. నా భార్యను కొందరు యువకులు కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లారు.. కాపాడండి సార్’’ అంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు..

నా భార్యను కిడ్నాప్ చేశారంటూ ఓ భర్త కేసు.. చివరగా ఇంట్లోనే ఆమె ఫోన్ స్విచాఫ్.. విచారణలో బయపటడిన ఘోరమిది..!

జనవరి 26వ తేదీన పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ సార్.. నా భార్యను కొందరు యువకులు కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లారు.. కాపాడండి సార్’’ అంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేశారు. అయితే ఆమె ఫోన్ చివరగా వారి ఇంట్లోనే స్విచాఫ్ అయినట్లు తెలిసింది. దీంతో వివిధ కోణాల్లో మరింత లోతుగా విచారణగా చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పరిధిలోని సిద్ధార్థ్ విహార్ ప్రతీక్ గ్రౌండ్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఆకాష్ త్యాగి అనే యువకుడు తల్లిదండ్రులతో పాటూ ఉంటున్నాడు. నోయిడాలోని ఓ కంపెనీలో పని చేసేవాడు. అక్కడే రియా జైన్(26) అనే యువతి కూడా పని చేస్తుండేది. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి.. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. మరోవైపు కొడుక్కి ధనవంతుల సంబంధం చూడాలని ఆకాష్ తల్లిదండ్రులు ప్రయత్నాలు చేసేవారు. కానీ కొడుకు మాత్రం రియా జైన్‌నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకోరనే ఉద్దేశంతో 2021మార్చిలో ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తర్వాత ఈ విషయం ఆకాష్ తండ్రికి తెలిసి కోడలిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా కోడలిని వదిలించుకోవాలని కొడుక్కి రకరకాల చాడీలు చెప్పి మనసు మార్చాడు.

ఎముకలు కొరికే చలిలో దుప్పటి కప్పుకుని మరీ బైక్‌పై భార్యాభర్తల ప్రయాణం.. మధ్యలో ఆరేళ్ల కొడుకు శవం..!


ఈ క్రమంలో రోజూ కట్నం పేరుతో తండ్రితో పాటూ ఆకాష్ కూడా భార్యను వేధించడం మొదలెట్టాడు. జనవరి 25న ఇదే విషయమై రియాజైన్‌తో ఆకాష్, అతడి తల్లిదండ్రులు గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆకాష్.. తన తండ్రితో కలిసి రియాజైన్‌ గొంతు కోశారు. ఆమె తల, మొండెం వేరు చేశారు. తర్వాత డెడ్ బాడీని సంచిలో వేసుకుని మొండాన్ని ఒకచోట, తలను మరో చోట విసిరేశారు. మరుసటి రోజు ఏమీ తెలీనట్లు పోలీసులకు ఫోన్ చేసి, తన భార్యను కొందరు యువకులు కిడ్నాప్ చేశారని ఆకాష్ ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా.. రియాజైన్ ఫోన్ చివరగా వారి ఇంట్లోనే స్విచాఫ్ అయినట్లు గుర్తించారు. ఆకాష్ కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి విచారించగా అసలు నిజం బయటపడింది. ఆకాష్, అతడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పేరుకు పెళ్లి కారు.. లోపల ఆడవాళ్లను ఎక్కించి.. వారు చేసిన పని తెలిస్తే అవాక్కవుతారు

Updated Date - 2022-01-29T00:03:53+05:30 IST