ఎన్‌టీఆర్‌ పేరు తొలగించడం హేయం

ABN , First Publish Date - 2022-09-23T06:00:24+05:30 IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును మార్చడం ఎంతో దుర్మార్గమని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

ఎన్‌టీఆర్‌ పేరు తొలగించడం హేయం
పొదిలిలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

పొదిలి సెప్టెంబర్‌ 22: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును మార్చడం ఎంతో దుర్మార్గమని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక పెద్ద బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభి షేకం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్శిటీ పేరు తొలగించడం తెలుగు జాతిని అవమానించడమే అన్నారు. ఎప్పుడో పెట్టిన పేరును ఇప్పుడు మార్చాలని చూడడం జగన్‌రెడ్డికి తగదన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో వైఎస్సార్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. కోట్లాది తెలుగు ప్రజల ఆరాద్యుడైన ఎన్టీఆర్‌ పేరును మార్చితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షు డు ముల్లాఖుద్దూస్‌,  రాష్ట్ర లీగల్‌సెల్‌ కార్యదర్శి ఎస్‌ఎం. బాషా, జిల్లా నాయకులు వై.వెంకటేశ్వరరెడ్డి, పొల్లా నరిసింహారావు, సామంతపూడి నాగేశ్వరరావు, ఎస్‌డీ. ఇమాంసా, షేక్‌.గౌస్‌, షేక్‌ షబ్బీర్‌ , మండల నాయకులు మావిళ్లపల్లి వెంకటేశ్వర్లు, జ్యోతి మల్లికార్జున, కాటూరి శ్రీను, రోళ్లశ్రీను, మునిశ్రీను, ఠాగూర్‌, కల్‌నాయక్‌, బాషా, జిలానీ, కాశీం తదితరులు ఉన్నారు.

త్రిపురాంతకం : హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తెలుగు జాతికే అవమానమని టీడీపీ మండల నాయకులు పేర్కొన్నారు. త్రిపురాంతకంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన యూనివర్శిటీ అభివృద్ధికి పాటుపడిన ఎన్‌టీఆర్‌ పేరును తొలగించి ఎటువంటి సంబంధంలేని వ్యక్తుల పేర్లు పెడితే జాతి క్షమించదని హెచ్చరించారు. వెంటనే జగన్‌ తన నిర్ణయాలను మార్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మేకల వలరాజు, మాజీ అధ్యక్షుడు మోటకట్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు ఆళ్ల నాసరరెడ్డి, దేవినేని చలమయ్య, వంకాయలపాటి ఆంజనేయులు, కటికి ఏడుకొండలు, ఊట్ల వెంకటేశ్వర్లు, వెన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేట : ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చడంపై టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పూనూరు భూపాల్‌రెడ్డి, సైదులు, ముప్పూరి రాము, బోయిళ్ళ రోషన్‌బాబు, సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేట(కంభం): కంభం పట్టణంలో గురువారం గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జీ ముత్తుముల అశోక్‌రెడ్డి అదేశాల మేరకు కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సీటి పేరు మార్చడం వైసీపీ ప్రభుత్వ రౌడిజం చేయడమంటూ కంభంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి దౌర్భాగ్యకార్యక్రమాలు చేయడం మంచి పద్దతికాదని హెచ్చరించారు.అకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసులుపార్లమెంట్‌ కార్యదర్శి కేతం శ్రీనివాసులుసయ్యద్‌ గౌస్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల : ఎన్‌టిఆర్‌ హెల్త్‌వర్సిటీకి పేరు మార్చడం తగదని మండల టీడీపీ అధ్యక్షులు కె.యోగానంద్‌ అన్నారు. రాచర్ల టీడీపీ కార్యాలయంలో గురువారం  టీడీపీ మండల నాయకులు ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా యోగానంద్‌ మాట్లాడుతూ రానున్న రోజు ల్లో వైసీపీకి బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్‌టీఆర్‌ పేరునే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు కత్యాణ్‌రెడ్డి, ఐటీడీపీ అధ్యక్షుడు పఠాన్‌ సన్నావుల్లాఖాన్‌, నియోజకవర్గ మైనారిటీ టీడీపీ నాయకులు షేక్‌ తాహర్‌భాషా, బీసీ సెల్‌ నాయకులు నల్లబోతుల శ్రీనివాసులు, ఎస్సీసెల్‌ పార్లమెంట్‌ సభ్యులు యామా సంజీవయ్య, జీవనేశ్వర్‌రెడ్డి, అశోక్‌, మున్నా, చందు, ఖాజా, అరుణ్‌, చరన్‌రెడ్డి పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : ఎన్‌టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పు తుగ్లక్‌ చర్యని సీపీఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గం కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్‌ విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో విశ్వవిద్యాలయం ఏర్పడిందన్నారు. 1998లో ఎన్‌టీఆర్‌ విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారన్నారు. దివంగత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇలాంటి పేరుమార్పులు లేవని గుర్తు చేశారు. కుట్రపూరిత రాజకీయాలతో రాత్రికిరాత్రి పేరు మార్చడం ఆమోదం తీసుకోవడం హేయమైనచర్యని ఆక్షేపించారు. జగన్‌ కక్షపూరిత వైఖరితో నియంత పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అంతగా తండ్రిపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో క్రొత్తగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి వైఎస్సార్‌ నామకరణం చేస్తే బాగుండేదని హితవు పలికారు. కార్యక్రమంలో దోర్నాల, త్రిపురాంతకం మండల కార్యదరులు విశ్వరూపాచారి, బాణాల రామయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T06:00:24+05:30 IST