ధాన్యం బాధ్యత ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2021-11-30T04:45:17+05:30 IST

ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదేనని, పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ మండలి సమావేశం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 1121 రకం ధాన్యాన్ని జిల్లాలో ప్రోత్సహించామని చెప్పారు.

ధాన్యం బాధ్యత ప్రభుత్వానిదే
మాట్లాడుతున్న మంత్రి బొత్స

మెరకముడిదాంలో మొక్కజొన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ 

టన్ను చెరకు ధర రూ.2,630 

పురపాలక శాఖ మంత్రి బొత్స 

కలెక్టరేట్‌, నవంబరు 29:

ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదేనని, పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ మండలి సమావేశం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 1121 రకం ధాన్యాన్ని జిల్లాలో ప్రోత్సహించామని చెప్పారు. ఈ విత్తనాలతో దిగుబడి అధికంగా రావడంతో పాటు సన్న బియ్యం ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. బియ్యం ముక్కలైపోతున్నాయన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొక్కజొన్న రైతుకు ఎటువంటి ఇబ్బంది లేదని, మొరకముడిదాంలో మొక్కజొన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రబీలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున రైతు అవసరాలకు తగినంతగా విత్తనాలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. జిల్లాలో ఖరీప్‌ సీజనలో ఆరు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని చెప్పారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. చెరుకు రైతులకు సంబంధించి భీమసింగి చెక్కర కర్మాగారం పరిధిలో సుమారు 30 వేల టన్నులు, ఎన్‌సీఎస్‌ ఫ్యాక్టరీ పరిధిలో లక్షా 25 వేల టన్నుల చెరుకు పండించినట్లు కేన్‌ కమిషనర్‌ లోకేష్‌ తెలిపారు. పంటనంతా శ్రీకాకుళం జిల్లా సంకిలి కర్మాగారానికి పంపించాలని నిర్ణయించామన్నారు. చెరుకు తీసుకున్న 10 నుంచి 14 రోజుల లోపు రైతులకు డబ్బులు చెల్లించాలని మంత్రి చెప్పారు. 

స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ర్టేషన

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే రిజిస్ర్టేషన్‌ చేస్తామన్నారు. ఇన్నాళ్లూ ఆస్తిపై హక్కు లేకుండా ఉన్నవారు ఎలాంటి రిజిసే్ట్రషన్‌ ఖర్చు లేకుండా నామమాత్రపు సొమ్ము చెల్లించడం ద్వారా హక్కుదారులవుతారని చెప్పారు. దీని వల్ల ఆస్తిని సులువుగా వారసులకు బదిలీ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సూర్యకుమారి, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, ఎంఎల్‌సీలు సురేష్‌బాబు, రఘురాజు, ఎంఎల్‌ఏలు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, జేసీలు కిషోర్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

విద్యుత చార్జీల కోసమే

 15వ ఆర్థిక సంఘ నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్న ప్రతిపక్షాల ఆరోపణలో నిజం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వ్యవసాయ మండలి సమావేశానికి ముందు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కేవలం విద్యుత్‌ చార్జీలను చెల్లించేందుకు మాత్రమే ఆ నిధులను వినియోగించినట్లు చెప్పారు. మున్సిపల్‌ కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులపై స్పందిస్తూ పాతవాటిని ముందుగా చెల్లిస్తామన్నారు. చెరకు రైతులకు నష్టం వాటిల్లే ఎటువంటి చర్యలను ఎన్‌సీఎస్‌ యాజమాన్యం చేపట్టినా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుమారు లక్ష టన్నుల చెరకును రైతులు పండించిన పక్షంలో భీమసింగి చెరుకు ఫ్యాక్టరినీ తెరవడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.  


Updated Date - 2021-11-30T04:45:17+05:30 IST