మాస్కులు ధరించారని బయటకు పంపేసిన రెస్టారెంట్‌.. America లో వింత ఘటన

Sep 21 2021 @ 07:14AM

వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనంటూ ప్రతి దేశం ఆదేశాలు జారీ చేస్తోంది. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, సోషల్ డిస్టెన్సింగ్ ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోగలుగుతామని ఆయా దేశాలు కోడై కూస్తున్నాయి. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా మాస్కులు ధరించారనే కారణంతో ఓ జంటను బయటకు పంపేసింది. తమ రెస్టారెంట్‌లో మాస్కులు ధరించడాన్ని అనుమతించమని, అందువల్ల మాస్కులు అయినా తొలగించాలని, లేదా రెస్టారెంట్‌ నుంచి వెళ్లిపోవాలని ఆ జంటను కోరింది. దీంతో షాక్ తిన్న ఆ జంట ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో విషయం విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలో నివశిస్తున్న నటాలీ వెస్టర్ తన భర్తతో పాటు టెక్సాస్‌లోని హ్యాంగ్ టైం బార్‌కు వెళ్లారు. అయితే మాస్కులు ధరించి వెళ్లడంతో గేటు వద్దే ఓ యువతి తమను మాస్కులు తొలగించాలని చెప్పిందని, కానీ మ్యూజిక్ ఎక్కువగా ఉండడంతో ఆమె తమ ముఖాన్ని ఓసారి చూడాలని మాత్రమే అడిగిందేమోనని, ఐడీలు చూపించి ఓ సారి మాస్క్ కూడా తీసి చూపించి మళ్లీ ధరించామని నటాలీ చెప్పారు. ‘ఆ తర్వాత కొందరు ఫ్రెండ్స్‌ను కలిశాం. డ్రింక్స్ ఆర్డర్ చేశాం. అరగంట తరువాత ఓ వెయిట్రెస్ మా వద్దకొచ్చి మాస్కులు తొలగించాలని, తమ బార్‌లో వాటిని అనుమతించమని చెప్పుకొచ్చింది. దీంతో షాక్ తిన్నాం. అయితే తమ నాలుగు నెలల చిన్నారికి పుట్టుకతోనే సిస్టిక్ ఫిబ్రోసిస్ అనే సమస్య ఉందని, అందువల్ల తాము అతడి కోసమే అనుక్షణం మాస్కులు ధరిస్తున్నామని వెయిట్రెస్‌కు చెప్పాం. దీంతో అలా అయితే మా బిల్‌ను క్లోజ్ చేస్తానని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె సూచించింది. దీంతో చేసేదేం లేక బిల్ కట్టి బయటకు వచ్చేశాం. ఆ తర్వాత తెలిసింది ఆ బార్ ఓనర్ టామ్ నో మాస్క్ రూల్‌ను పాటిస్తాడని. అయితే మొదట మాస్కులు ఉంటే లోపలకు అనుమతించరని తెలియగానే ఇద్దరం షాక్‌కు గురయ్యాం’ అని వెస్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.