ఫలించిన అమీన్‌గూడ వాసుల దశాబ్దాల కల

Published: Sun, 27 Mar 2022 22:57:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫలించిన అమీన్‌గూడ వాసుల దశాబ్దాల కలఅమీన్‌గూడ గ్రామం(ఫైల్‌)

- అమీన్‌గూడ వాగుపై వంతెన పనులు ప్రారంభం

- కల నెరవేరుతున్న వేళ, ఆనందంలో గిరిజనులు

తిర్యాణి, మార్చి 27: ఆ గూడాల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే బాహ్యప్రపంచంతో సం బంధాలు కోల్పోతారు. అత్యవసర సమయాల్లో నైతే దేవుడేదిక్కు. వర్షాకాలంలో రేషన్‌ సరుకు లకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. వర్షా కాలంలో పశువులు, మనుషులు వాగు ఉధృతికి కొట్టుకు పోయి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలు లేక పోలేదు. మండల కేంద్రానికి ఐదుకిలో మీటర్లదూరంలో ఉన్న ప్పటికీ 2014లో సార్వత్రిక ఎన్నికల్లో వర్షం ఉధృతి కారణంగా వారి విలువైన ఓటుహక్కును కూడావినియోగించుకోలేక పోయారు. అలాంటి గూడానికి వాగుపై వంతెనపనులు ప్రారంభం కావ డంతో వారి ఆనందానికి అవధులు లేవు. అదే కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అత్యంత వెనకబడిన ఆదివాసీ తిర్యాణి మండలానికి చెందిన ఆమీన్‌గూడ గ్రామం.

తిర్యాణి మండలంలోని అమీర్‌గూడ గ్రామానికి వెళ్లే రహ దారి మధ్యలో గల వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావ డంతో ఆ గ్రామంలో నివసించే ఆదివాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డీఎంఎఫ్‌టీ నిధులు 1.50కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బ్రిడ్జి నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. దీంతో అమీన్‌గూడ, కోయతలండి, గోయగాం, బోరింగ్‌గూడ గ్రామాలకు ఈ వర్షాకాలంలో చాలా మేరకు ఇబ్బందులు తప్పుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు.  వాగుపై వంతెన లేక పోవడంతో వర్షాకాలంలో ఆ గూడాల ఆదివాసీ ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సంవత్సరాల తరబడి వారి కష్టాలను అధికారులకు, ప్రజాప్ర తినిధులకు విన్నవిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మా ణానికి నిధులు మంజూరు కావడంతో ఇటీవలే పనులు ప్రారంభించారు. కాగా ఇక్కడి గూడాల ప్రజలు రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద గిరిజనులు. నిత్యం కూలీ పనులకు వెళ్లి పొట్ట పోసు కునే వారికి ఇదే ప్రధాన రహదారి మార్గం. దీంతో వర్షాకాలం వచ్చి దంటే రేషన్‌ సరుకులపైన ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగించే వారు. అప్పుడప్పుడు వాగు ఉధృతి తగ్గితేతప్ప బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టలేరు. దీంతో వారి ఆర్థికపరిస్థితి మరింత దిగజారి జీవించడం కష్ట మవుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా వాళ్ల అవస్థ మార లేదు. వాగుపై వంతెన పూర్తైలే తమ కష్టాలు తీరినట్లేనని దశాబ్దాలుగా తమ కల సాకారమవుతుందని ఆయా గూడాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

బిడ్ర్జి పూర్తైతే మా గోస తీరుతుంది

- జైనేని శంకర్‌, అమీన్‌గూడ

వాగుపై వంతెన పూర్తైతే ఎన్నో ఏళ్లుగా మేము పడుతున్న కష్టానికి ఫలితం లభించి నట్లే. రెక్కాడితే గాని డొక్కాడని మాకు ప్రతి రోజు ఊర్లొకి వెళ్లి పనివెతుక్కోవాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో పస్తులుం డాల్సిన పరిస్థితులున్నాయి. వంతెన పూర్తైతే మాకష్టాలు తీరుతాయి.

కల సాకారమవుతుంది

- సుజాత, తలండి సర్పంచ్‌

ఎన్నోఏళ్లుగా వాగుపై వంతెనలేక భయంగా నేను కూడా కష్టా లను అనుభవించాను. నేను సర్పంచ్‌గా ఉన్న కాలంలో వంతె నకు నిధులు మంజూరు కావడానికి కృషిచేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మిలకు రుణపడి ఉంటాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వంతెనకు నిధులు మంజూరవడం సంతోషంగా ఉంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.