ఫలితం నేడే

ABN , First Publish Date - 2020-10-12T09:33:16+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెలువడనుంది

ఫలితం నేడే

నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

ఆరు టేబుళ్ల ఏర్పాటు.. రెండు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి

కేవలం రెండు గంటల్లోనే వెలువడనున్న ఫలితం

కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు

పదహారు నెలల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న కవిత

ఫలితంపై కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ

ఓట్లు చీలినట్టు ఇరు పార్టీల నేతల అనుమానం


నిజామాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెలువడనుంది. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్‌ను రెండు రౌండ్లలో పూర్తిచేసి వెం టనే ఫలితాన్ని ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నిక ఫలి తం అధికారపక్షంలో మరింత జోష్‌ను నింపనుండగా.. ప్రతి పక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు ఎన్ని ఓట్లు వచ్చాయో తే లనుంది. ఈ ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం కావడంతో ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో మరింత భరోస నింపుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.


ఓట్ల లెక్కింపు నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో జరగ నుంది. కరోనా నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రంలో కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్‌కు అనుగుణంగా ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమై రెండు రౌండ్లలో పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే గెలిచిన అభ్యర్థికి రిట ర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం అందిస్తారు. కౌంటింగ్‌ సందర్భంగా సిబ్బందితో పాటు ఏజెంట్లను 7 గంటలకే అను మతించనున్నారు. ఈ ఉప ఎన్నికలో మొదటిసారిగా అన్ని ఓట్లు పోలవడం వల్ల కౌటింగ్‌ను ఆరు టేబుళ్ల ద్వారా పూర్తి చేయనున్నారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.


ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సు భాష్‌రెడ్డి పోటీపడుతున్నారు. ఎవరూ ప్రత్యక్షంగా ప్రచారం చేయకున్నా తమ పార్టీ ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయ త్నం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించి పోలింగ్‌ రోజున తీసుకువచ్చారు. బీజే పీ నేతలు కూడా క్యాంపు నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం తమ పార్టీ ప్రజాప్రతినిధులతో మంతనాలు నిర్వ హించారు. అందరి ప్రయత్నం వల్ల మొదటిసారి మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉ మ్మడి జిల్లా పరిధిలో 80 శాతానికి పైగా ఓట్లు అధికార ప క్షానికి ఉండడంతో గెలుపు వన్‌సైడ్‌గానే ఉంది. అధికార పార్టీకి ఉమ్మడి జిల్లా పరిధిలో 570 ఓట్లతో పాటు 24 ఓట్లు ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు ఉంది. వీరితో పాటు కాంగ్రె స్‌, బీజేపీ నుంచి కూడా కొంత మంది టీఆర్‌ఎస్‌లో చేరడ డంతో అధికార పక్షం అభ్యర్థి బలం మరింత పెరిగింది. ఉ మ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్‌కు 152, బీజేపీకి 78 ఓట్లు ఉం డడంతో గెలుపుపై ఆశ లేకున్నా ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ ఉండాలని అభ్యర్థులను బరిలోకి దింపారు. 


కవిత గెలుపు లాంఛనమే

ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే కానుంది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చిన ప్పడే టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ వేసినప్పుడే ఖాయం అయినా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గో వర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌ అమీర్‌, హన్మంత్‌ షిం డే, జాజాల సురేందర్‌, స్పీకర్‌ తనయులు డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, సురేందర్‌, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్‌, ఆకుల లలిత, జడ్పీ చైర్మన్లు, మేయర్‌, మున్పిపల్‌ చైర్మన్లు తమ వంతు ప్రయత్నాలు చేశారు. తమ పార్టీ తరఫున పోటీ చేసిన కవితకు భారీ మెజారిటీ వచ్చే విధంగా ఎవరికి వారు కృషి చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఓట్లు చీలకుం డా చూశారు. పార్టీ వారితో పాటు ఇతరుల మద్దతు కూడగ ట్టి భారీగా ఓట్లు పడేటట్లు ప్రయత్నం చేశారు. 


ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుండడంతో పార్టీ శ్రే ణులు ఉత్కంతగా ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ అభ్య ర్థి గెలుపు ఖాయమైనా ఎన్ని ఓట్లు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. వందశాతం పోలింగ్‌ జరగడంతో ఎవరికివా రు అంచనా వేస్తున్నారు. తమ అభ్యర్థికి 700పైగా ఓట్లు వ స్తాయని లెక్కలు వేస్తున్నారు. తమ అభ్యర్థి కల్వకుంట్ల కవి త గెలుపును ప్రకటించగానే సంబరాలు నిర్వహించేందుకు అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితం ప్రకటించగానే గెలిచిన కల్వకుంట్ల కవితను అభినందించేం దుకు జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు.


పదహారు నెలల తర్వాత పదవిలోకి

పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత పదవిలోకి వస్తున్నారు. గడిచిన పదహారు నెలలు ఏ పదవిని ఆమె చేపట్టలేదు. ప్రస్తుతం ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్సీగా ఆమె ఎన్నికవుతున్నారు. ఇక ఆమె ఉమ్మ డి జిల్లా ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఇప్పటి వరకు పదవులు చేపట్టని ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికైనా తర్వాత కీలకమైన హోదాలో ఉండను న్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి గానీ, లేదా అందుకు స మానమైన ఇతర పదవిగానీ ఆమెకు వచ్చే అవకాశం ఉన్న ట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మండలిలో కీలక మైన పదవితో పాటు పార్టీలోనూ ఉన్నత పదవిని ఆమె చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా నేతలు భావిస్తున్నారు.  కీలకమై న పదవులు ఆమె చేపడితే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని నిధులు వస్తాయని భావిస్తున్నారు.  


కాంగ్రెస్‌, బీజేపీలోనూ ఉత్కంఠ

ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయోనని కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, పోతంకార్‌ లక్ష్మీనారా యణ, ఆ పార్టీల నేతలో ఉత్కంత నెలకొంది. తమ పార్టీ ప్రజా ప్రతిని ధులు తమకు ఎంత మొత్తంలో మద్దతు ఇచ్చారో వారు అంచనాకు వస్తున్నారు.  ఈ ఉప ఎన్నికలో తమ ఓట్లు ఎక్కవగా చీలా యని బీజేపీ నేత లు భావిస్తు న్నారు.  


ఓట్ల లెక్కింపుజాగ్రత్తగా నిర్వహించాలి

నిజామాబాద్‌ అర్బన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా నిర్వహించాలని ఎన్నికల రిటర్ని ంగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. ఆదివారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులకు నిర్వహించిన శిక్షణ శిబిరాని కి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. స్ర్కూ ట్నీ జాగ్రత్తగా చేయాలని, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లు ఎన్నికల సంఘం జారీచేసిన నియమనిబంధనల విషయంలో క్లారిటీతో ఉండాలన్నారు. ఎటువంటి సందేహాలున్నా తమతో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, ని బంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, నిజామాబాద్‌, బోధన్‌ ఆర్డీవోలు రవి, రాజేశ్వర్‌, ఏవో సుదర్శన్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-12T09:33:16+05:30 IST