ఆత్మకూరు ఫలితం తేలేది నేడే!

ABN , First Publish Date - 2022-06-26T08:38:06+05:30 IST

ఆత్మకూరు ఫలితం తేలేది నేడే!

ఆత్మకూరు ఫలితం తేలేది నేడే!

ఆత్మకూరు, జూన్‌ 25: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. పట్టణ శివార్లలోని ఆంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 14 టేబుళ్లపై 20 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రానికల్లా అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

Updated Date - 2022-06-26T08:38:06+05:30 IST