వరికి నిప్పంటించిన రైతు

ABN , First Publish Date - 2020-10-27T10:50:40+05:30 IST

మండలంలో గట్టుబూత్కూర్‌లో రైతులు వరిపంటకు నిప్పంటించారు. గట్టుబూత్కూర్‌కు చెం దిన గంకిడి అనిల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశారు

వరికి నిప్పంటించిన రైతు

గట్టుబూత్కూర్‌, అక్టోబరు 26: మండలంలో గట్టుబూత్కూర్‌లో   రైతులు  వరిపంటకు  నిప్పంటించారు. గట్టుబూత్కూర్‌కు చెందిన గంకిడి అనిల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశారు. నాలుగెకరాల్లో సన్నరకం వరి సాగు చేశారు. చేతికొచ్చే సమయంలో పంటకు దోమపోటు సోకడంతో మొత్తం ఎండిపోయింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రైతులు నాలుగెకరాల వరి పంటకు నిప్పంటించారు. ప్రతి యేడూ దొడ్డు రకాలు సాగు చేసేవారమని, ఆ రకాలు రోగాలకు తట్టుకునేవని అనిల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ యేడు అధికారుల ఆంక్షలతో సన్నరకాలు సాగు చేశామని, పంటకు దోమపోటు సోకి పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1.30 లక్షలు నష్టపోయామని వారు వాపోయారు. 

Updated Date - 2020-10-27T10:50:40+05:30 IST