ఓటుహక్కును వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-03-07T05:08:24+05:30 IST

న్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్‌ సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తెలిపారు.

ఓటుహక్కును వినియోగించుకోవాలి
అధికారులకు సూచనలు ఇస్తున్న జేసీ సాయికాంత్‌వర్మ

ప్రొద్దుటూరు, మార్చి 6 : ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్‌ సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన పోలింగ్‌ అధికారుల శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికల విధుల ఉత్తర్వులను ఉద్యోగి గుర్తింపుకార్డును, ఓటరు కార్డును చూపించి పోస్టల్‌ బ్యాలెట్‌ను పొందవచ్చన్నారు. ప్రతి 4 వార్డులకు ఒక ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌, కమిషనర్‌ గంగాప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూచనలు సలహాలు తెలియజేశారు. జేసీ వెంట ప్రత్యేక అధికారి రోహిణి, ఏసీపీ మునిరత్నం తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా పోలింగ్‌ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీఎస్పీ ప్రసాదరావు పోలింగ్‌ అధికారులకు వివరించారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులుంటే సత్వరమే పోలీసుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. డీఎస్పీ వెంట సీఐలు నాగరాజు, విశ్వనాధరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:08:24+05:30 IST