పాపం.. ఈ ఊరి జనం.. ఏది కావాలన్నా..

ABN , First Publish Date - 2022-08-13T05:43:33+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలో సమీపంలో ఉన్న రాయలవారిపల్లికి సరైన రహదారి లేక పదినెలలుగా తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు.

పాపం.. ఈ ఊరి జనం.. ఏది కావాలన్నా..
చిత్రావది నదిలోకి దిగలేక నిలబడిన రాయలవారిపల్లి వాసులు

రాయలవారిపల్లికి దారేది..?

ఏది కావాలన్నా నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే...

పది నెలలుగా గ్రామస్థుల అవస్థలు


పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలో సమీపంలో ఉన్న రాయలవారిపల్లికి సరైన రహదారి లేక   పదినెలలుగా తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఈ గ్రామంలో 90 కుటుంబాలుండగా 300 ఓటర్లు, 400 జనాభా ఉంది. రాయలవారిపల్లి- ఎనుములపల్లి కలుపుతూ చిత్రావతి నదిపైన గతంలో ఆర్డీటీ చెక్‌డ్యాం నిర్మించింది. అయితే గత నవంబరులో చిత్రావతికి వచ్చిన వరదల వల్ల ఆ చెక్‌డ్యాం కొట్టుకుపో యింది. దీంతో ఆ గ్రామానికి  ఇతర గ్రామాలకు సంబందాలు తెగిపోయాయి. నాటి నుంచి దాదాపు 10 నెలలు గా పట్టణం లోకి రావాలంటే ఆ గ్రామస్థులు నానా కష్టాలు పడుతు న్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు పుట్టపర్తికి చిత్రావతి నదిలో నడుము లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.కొత్తగా జిల్లా ఏర్పడితే సౌకర్యాలు మెరుగుపడతాయని భావిం చామని, అయితే అందుకు విరుద్దంగా తమకు కష్టాలు తీవ్రం అయ్యాయని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. ఏది కావాలన్నా నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, ఉప్పు, పప్పు చివరికి జ్వరం వచ్చినా పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.  ప్రస్తుతం గ్రామం  నుంచి పుట్టపర్తికి రావాలంటే కొయ్యలగుట్టపల్లి మీదుగా నాలుగు కిలోమీ టర్లు నడవాల్సి వస్తోందన్నారు.



చిత్రావతి ఉధృతంగా పారితే ఇక ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందేనని వాపోతు న్నారు. మట్టికట్టడం వల్ల ప్రయోజనం లేదని, శాశ్వత పరిష్కారం చూపాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. అధికా రులు, ప్రజాప్రతి నిధులు పరిశీలిం చడమే తప్పా పరిష్కారం చూపలేదని వాపోతున్నారు. చెక్‌డ్యాం తెగిపోవ డం తో రైతుల పొలాల మీద అడ్డ దారిలో నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు. కనీసం చిత్రావతి పోరంబోకులో మ ట్టిదారైన వేసేలా అధికారులు దృష్టి సారించాల ని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. ఈ కష్టం తమకు ఎప్పుడు తీరుతుం దోనని నిస్పాహాయత వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-13T05:43:33+05:30 IST