ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-10-24T04:59:45+05:30 IST

ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

కులకచర్ల: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 21 మంది ఉపాధ్యాయులను ఆయన సన్మానించి మాట్లాడారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా శంకర్‌, శేఖర్‌, గాయత్రి, బస్వరాజ్‌, రాఘవేందర్‌రెడ్డి, వెంకటయ్య, క్రిష్ణయ్య, పరుషురాం, జైపాల్‌రెడ్డి, స్వప్న, రాజు, శీనయ్య, అజ్మత్‌, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, హేమ, శ్రావణ్‌, శ్రీనయ్య, ఇసాచ్చుఖాద్రి, గౌస్‌, మైనోద్దీన్‌, కవితలు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, ఎంఈవో అబీబ్‌హమ్మద్‌, సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్‌నాయక్‌లు పాల్గొన్నారు. కాగా పట్టపహాడ్‌ గ్రామంలో చెరువు తూములో ఇరుక్కొని మృతి చెందిన మల్లయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. శనివారం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు. జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, రాజశేఖర్‌గౌడ్‌, శేరి రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, క్రిష్ణయ్యగౌడ్‌, సారా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కాగా 238 మంది మహిళలకు ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, స్టవ్‌లను  స్థానిక గురుదత్తా గ్యాస్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీగురుదత్తా గ్యాస్‌ ఎజెన్సీ నిర్వాహకురాలు లక్ష్మిఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T04:59:45+05:30 IST