దేశరక్షణలో నావికాదళం పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-12-06T05:13:58+05:30 IST

దేశరక్షణలో నావికాదళం పాత్ర ఎంతో కీలకమైనదని నెల్లూ రు ఈసీహెచ్‌ఎస్‌ కమాండింగ్‌ అధికారి డీవీ ఎస్‌.రావు పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని అంబేడ్కర్‌ భవనంలో మాజీ సైనికుల ఆధ్వ ర్యంలో జాతీయ నావికాదళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

దేశరక్షణలో నావికాదళం పాత్ర కీలకం
మాట్లాడుతున్న కమాండింగ్‌ అధికారి డీవీఎస్‌.రావు

కమాండింగ్‌ అధికారి డీవీఎస్‌.రావు


 ఒంగోలు(రూరల్‌), డిసెంబరు 5: దేశరక్షణలో నావికాదళం పాత్ర ఎంతో కీలకమైనదని  నెల్లూ రు ఈసీహెచ్‌ఎస్‌ కమాండింగ్‌ అధికారి డీవీ ఎస్‌.రావు పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని అంబేడ్కర్‌ భవనంలో మాజీ సైనికుల ఆధ్వ ర్యంలో జాతీయ నావికాదళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డీవీఎస్‌.రావు మాట్లాడుతూ  మనదేశం అధునాతన యుద్ధనౌకలు కలిగి ఉందని, దీంతో పక్కదేశాలు యుద్ధానికి దిగే పోరాడే పరిస్థితి లే దన్నారు. మాజీ సైనికుల జేఏసీ జాతీయ అధ్య క్షుడు నెప్పలి నాగేశ్వరరావు మాట్లాడుతూ 1971 లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో కరాచి నౌకా దళ కేంద్రాన్ని భారతీయ నావికాదళం ఎంతో సా హసంతో తుద ముట్టించిదని తెలిపారు.  భారతీ య సైనికుల సాహసాలు ఎంత చెప్పుకున్నా త క్కువేనన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాసవి శ్వనాఽథన్‌ మాట్లాడుతూ తాను మాజీ సైనికుడనే నని తెలిపారు. మాజీ సైనికులు ప్రభుత్వ అవ కాశాలు ఉపయోగించుకోవాలని కోరారు.  ముం దుగా అమరజవానుల విజయస్థూపం వద్ద పు ష్పాంజలి ఘటించారు. 1971లో నావికా దళంలో పనిచేసిన సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ సంద్భంగా జరిగిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా అధ్యక్షుడు చుండూరి శ్రీ రామూర్తి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సైనిక సంక్షేమశాఖాధికారి రజినికుమారి, కమిటీ చైర్మన్‌ లింగాల జగన్‌రెడ్డి, జిల్లా ఉద్యోగ కల్పనా అధికా రి ఇందిరాదేవి, మాజీ సైనికులు సీబీఆర్‌.ప్రసాద్‌, పాశం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-06T05:13:58+05:30 IST