‘ఉక్కు’లో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-08-10T06:08:29+05:30 IST

నష్టాలను చవిచూసిన ఆరేళ్ల తర్వాత సంస్థను లాభాల బాటలో నడిపించడంలో స్టీల్‌ ప్లాంట్‌ మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు.

‘ఉక్కు’లో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం
గీతాంజలి బత్మనాబానేను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న అతుల్‌భట్‌

డబ్ల్యూఐపీఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ 

ఉక్కుటౌన్‌షిప్‌, ఆగస్టు 9: నష్టాలను చవిచూసిన ఆరేళ్ల తర్వాత సంస్థను లాభాల బాటలో నడిపించడంలో స్టీల్‌ ప్లాంట్‌ మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఫోరమ్‌ ఫర్‌ వుమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌ (డబ్ల్యూఐపీఎస్‌) సిల్వర్‌ జూబ్లీ వేడుకలు మంగళవారం స్టీల్‌ ప్లాంట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, స్టీల్‌ ప్లాంట్‌లో మహిళా ఉద్యోగులు అందిస్తున్న సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ పోటీల్లో కామన్వెల్త్‌ గేమ్స్‌లో ప్రతిష్టాత్మమైన స్వర్ణం సాధించినందుకు స్టీల్‌ ప్లాంట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ పీవీ సింధును ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య వక్తగా విచ్చేసిన గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి ప్రో వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ గీతాంజలి బత్మనాబానే మాట్లాడుతూ మహిళలు తమ జీవితంలో విజయాల కోసం సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్యం, సంస్కారాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఆమెను ఉక్కు సీఎండీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు డీకే మహంతి (కమర్షియల్‌), కేకే ఘోష్‌ (ప్రాజెక్ట్స్‌), ఏకే సక్సేనా (ఆపరేషన్స్‌), సీవీవో కేవీ నాగిరెడ్డి, వీస్టీల్‌ మహిళా సమితి అధ్యక్షురాలు నుపుర్‌భట్‌, జీఎం (హెచ్‌ఆర్‌) సుష్మాసక్సేనా, సీజీఎం (హెచ్‌ఆర్‌) కె.శ్రీనివాసరావు, కో-ఆర్డినేటర్‌ ఎస్‌.చంద్రావతి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:08:29+05:30 IST