విభజనతో పాలన మూడు ముక్కలు

ABN , First Publish Date - 2021-10-18T04:12:20+05:30 IST

ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువుగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రభు త్వం నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పూర్తయింది.

విభజనతో పాలన మూడు ముక్కలు
ఏ బూడిదిపాడు గ్రామం వ్యూ

- ‘డీ’కి బదులు ‘ఏ’ వేయడంతో బూడిదపాడు గ్రామస్థులకు కష్టాలు మొదలు

- సమీప మండలాన్ని కాదని 26కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలంలో కలిపారు

- పూర్వపు మండలం మానవపాడులో కలపాలని ఐదేళ్లగా గ్రామస్థుల వేడుకోలు

ఉండవల్లి, అక్టోబరు 17: ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువుగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రభు త్వం నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి   ఐదు సంవత్సరాలు పూర్తయింది. అయితే అర్థం లేని విభజన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండ లంలోని ఏ బూడిదిపాడు గ్రామస్థులకు శాపంగా మా రింది.  పూర్వపు మానవపాడు మండల కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏ బూడిదిపాడును ఎక్కడో 26 కిలో మీటర్ల దూరంలో ఉన్న నూతనంగా ఏర్పాటు చేసిన ఉండవల్లి మండల పరిధిలో కలపడం తో గ్రామ పాలన మూడు ముక్కలుగా మారింది. 

అక్షర దోషమే..

మండలాల విభజ నలో అలం పూర్‌ మం డలంలోని ఆరు గ్రామాలు (తక్కశిల, మారమునగాల, ప్రాగటూర్‌, శేరుపల్లి, బైరాపురం, బస్వాపురం), మానవ పాడు మండలంలోని ఎనిమిది గ్రామాలను(ఉండవల్లి, కంచుపాడు, చిన్న ఆముదాలపాడు, ఇటిక్యాలపాడు, బొంకూర్‌, మెన్నిపాడు, పుల్లూరు, కలుగొట్ల)కలిపి ఉం డవల్లి మండలంగా ఏర్పాటు చేశారు. ఏ బూడిదిపాడు గ్రామం మాత్రం మానవపాడు మండలంలోనే ఉండేది, కొన్ని రోజుల తర్వాత  ఉండవల్లి మండలంలో విలీనం చేశారు. ఉండవల్లి మండలంలో 14 గ్రామ పంచాయ తీలతో పాటు  మరో మూడు  రెవెన్యూ గ్రామాలు అయిన డి బూడిదిపాడు, షాలీపూర్‌, ఖానాపూర్‌లను క లిపారు. ఏ బూడిదిపాడు గ్రామం ఉండవల్లి మండలం లో కలపడంతో మండలం నైసర్గిక స్వరూపం మారి పోయింది. డి బూడిదిపాడుకు బదులు ఏ బూడిదిపా డు అని అక్షరదోషమే కారణం అయ్యిందని గ్రామస్థులు వాపోతున్నారు. 

విభజనతో పాలన మూడు మండలాల్లో..

మండలం ఏర్పాటుతో ఏ బూడిదిపాడు గ్రామం పరిపాలన మూడు ముక్కలైంది. మండలం మారిన రేషన్‌, సంక్షేమ పథకాలు మాత్రం మానవపాడు మం డల అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. గ్రా మంలో ఏదైనా తగాదాలు, లా అండ్‌ ఆర్డర్‌ మాత్రం వడ్డేపల్లి మండలకేంద్రంలోని శాంతినగర్‌ పో లీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. రెవెన్యూ, వ్యవసాయ, జనన, మరణ, ఆధార్‌, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల వంటివి ఉండవల్లి మండల కేంద్రానికి వెళ్లా ల్సి వస్తుంది. దీనితో గ్రామ పాలన మూడు మండలాల అధికా రులు పర్యవేక్షించే పరిస్థితి నెలకొంది.

మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా..

ఏ బూడిదపాడును ఉండవల్లి నుం చి మానవపాడు మండలంలో కలపాల ని గతంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణా రావుకు, కలెక్టర్లకు, సెక్రటేరియట్‌లోని సంబంధి త అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా పలుమార్లు సమావేశాలను బహిష్కరించి తమ ని రసనను వ్యక్తం చేశారు. ఎన్నిక లను సైతం బహిష్కరి స్తున్నామని ఎన్నికల కమిషన్‌ కు  ఫిర్యాదు కూడా చేశారు. సమస్య పరిష్కారానికి అడుగు పడకపోవ డంతో ఇటీవల అలంపూర్‌ చౌ రస్తాలో పుర పాలక మంత్రి కేటీఆర్‌ వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి వచ్చిన నేపథ్యంలో ఎంపీటీసీ, సర్పంచు వినతిపత్రం అందజేశారు. త్వరగా తమ గ్రామాన్ని మానవపాడు మండలపరిధిలోకి  తీసుకురావాలని ఏ బూడిదిపాడు గ్రామస్థులు వేడుకుంటున్నారు.

న్యాయ బద్ధమైన విభజన కాదు

మా గ్రామాన్ని మానవపాడు మండలంలో కాకుండా ఉండవల్లి మండలంలో కలపడం న్యాయబ ద్ధంగా లేదు. సమీపంలో ఉన్న మానవపాడు మండలంలో కాదని, 26కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలి.

- గడ్డం భరతసింహా రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు

అధికారుల నిర్లక్ష్యమే కారణం 

  గ్రామాన్ని ఉండవల్లి మండలంలో కలపడానికి సరైన కారణం లేదు. డి బూడిదిపాడుకు బదులు ఏ బూడిదిపాడు అని మారి ఉండొచ్చు. అధికారుల తప్పేదం గ్రామస్థులకు శాపంగా మారింది.   ఉన్నతాధికారులు తమ గ్రామాన్ని మానవపాడు మండలంలోకి తీసుకరావాలి. 

- విరుపాక్షి రెడ్డి, గ్రామ సర్పంచు

 ప్రతిపాదనలు పంపించాం

ఏ బూడిదిపాడు ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. డి బూడిదిపాడు గ్రామం ఉండవ ల్లి మండలంలో, ఏ బూడదిపాడు గ్రామం మానవపాడులో ఉండేవిధంగా ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపాం. ఆ గ్రామం మానవపాడు మండలంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.  

వీరభద్రప్ప, తహసీల్దార్‌, ఉండవల్లి

Updated Date - 2021-10-18T04:12:20+05:30 IST