అమరవీరుల త్యాగాలు వృథా కానివ్వం

ABN , First Publish Date - 2022-08-15T05:15:39+05:30 IST

స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమని, వారి త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛా జీవనమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అమరవీరుల త్యాగాలు వృథా కానివ్వం
వర్గల్‌ మండలం గౌరారం రాజీవ్‌ రహదారిపై 150 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న హరీశ్‌రావు

సమరయోధుల పోరాట ఫలితమే నేటి స్వేచ్ఛా జీవనం

గౌరారం రాజీవ్‌ రహదారిపై స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

వర్గల్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమని, వారి త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛా జీవనమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం వర్గల్‌ మండలం గౌరారంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 150 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు రాజీవ్‌ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎందరో మహానుభావులను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భారతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన దినం సందర్భంగా సంబరాలను అన్ని గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఎంపీపీ జాలిగామ లతారమే్‌షగౌడ్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, జడ్పీటీసీ బాలుయాదవ్‌, సర్పంచ్‌ వినోద నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, మహిళలు పాల్గొన్నారు. 

సిద్దిపేట క్రైం: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ద్వారా జాతీయ స్ఫూర్తిని చాటుదామని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ వాక్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కడవేరుగు రాజనర్సు, పీఆర్టీయూ అసోసియేట్‌ అధ్యక్షుడు లక్కిరెడ్డి విజయ, తదితరులు పాల్గొన్నారు. 

చిన్నకోడూరు: చిన్నకోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం యువకులకు మండలస్థాయి కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్‌, టగ్‌ఆ్‌ఫవార్‌ క్రీడా పోటీలను నిర్వహించినట్లు ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. అలాగే బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో చిన్నకోడూరులోని జాతీయ నాయకుల విగ్రహాలకు బీజేపీ మండలాధ్యక్షుడు పిట్ల పరశురాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేందర్‌రెడ్డి, శివరాంగౌడ్‌ తదితరులు ఆదివారం పూలమాల వేశారు. 

దౌల్తాబాద్‌: దౌల్తాబాద్‌ మండల పరిధిలోని మహ్మద్‌ షాపూర్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌ విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని లింగరాజుపల్లి మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగాధరి సంధ్య హాజరై మాట్లాడారు. 

ములుగు: మండల కేంద్రమైన ములుగులో మండలస్థాయి వాలీబాల్‌ పోటీలను ఆదివారం నిర్వహించారు. మండల పరిధిలోని ఏడు జట్లు పాల్గొనగా, గంగాధర్‌పల్లి టీం వాలీబాల్‌ ఫైనల్లో గెలిచిందని ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

ములుగు: ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాజపేట యాదమ్మకృష్ణగౌడ్‌ మాట్లాడారు. 

నారాయణరావుపేట: నారాయణరావుపేట మండలంలో ఆదివారం మండలస్థాయి వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. ఫైనల్‌ మ్యాచ్‌లో గుర్రాలగొంది జట్టు విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, ఎంపీడీవో మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. 

చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి ప్రారంభించారు. అలాగే కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలో సర్పంచ్‌ భీమనపల్లి కరుణాకర్‌ ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

కొండపాక: కొండపాకలో ఆదివారం నిర్వహించిన వాలీబాల్‌ పోటీలను జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌ ప్రారంభించారు. అలాగే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొండపాకలోని ఉండబకలో ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

దుబ్బాక/మిరుదొడ్డి: స్వతంత్ర వజ్రోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు కోరారు. ఆదివారం మిరుదొడ్డిలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని టపాసులను పేల్చారు. అలాగే దుబ్బాక మండలం రామక్కపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకారంగా కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

జగదేవ్‌పూర్‌: స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని సామూహిక జాతీయ గీతాలపనలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎస్‌ఐ కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రధాన చౌరస్తాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. 

పప్పు ధాన్యాలతో జాతీయ జెండా

గజ్వేల్‌ రూరల్‌, ఆగస్టు 14: గజ్వేల్‌ రామకోటి రామరాజు ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం తన కార్యాలయంలో ఆయా రకాల పప్పు ధాన్యాలతో జాతీయ జెండాను తయారు చేశాడు. కాషాయానికి ఎర్రపప్పు, తెలుపునకు బియ్యపు గింజలు, ఆకుపచ్చకు పెస్లతో 4 అడుగుల జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. 


Updated Date - 2022-08-15T05:15:39+05:30 IST