సమరయోధుల త్యాగాలు మరువలేనివి: సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-10T05:42:05+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరవలేనివ ని సబ్‌ కలెక్టర్‌ నవీన అన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మంగళవా రం మండలంలోని మెళవాయి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, ప్ర ముఖ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి దంపతులను ఆయన సన్మానించారు.

సమరయోధుల త్యాగాలు మరువలేనివి: సబ్‌ కలెక్టర్‌
మెళవాయి గోవిందరెడ్డి దంపతులను సన్మానిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నవీన

మడకశిర రూరల్‌, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరవలేనివ ని సబ్‌ కలెక్టర్‌ నవీన అన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మంగళవా రం మండలంలోని మెళవాయి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, ప్ర ముఖ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి దంపతులను ఆయన సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు మరచిపోలేని వన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. మెళవాయి గోవిందరెడ్డి మాట్లాడుతూ 1942లో విద్యార్థిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో అరెస్టు చేసి వదిలేసినట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో స్వ ర్గీయ శ్రీరామిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, నీలంసంజీవరెడ్డిలతో పాటు ఉద్యమంలో వలంటీరుగా పనిచేశానని తెలిపారు. కర్ణాటక గవర్నర్‌ భరతరాజ్‌ అప్పట్లో తనను గుర్తించి గాంధీజయంతి సందర్భంగా సన్మానించారని తెలిపారు. అనంతరం గోవిందరెడ్డి దంపతులను సబ్‌ కల్టెకర్‌ నవీన శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌, ఎంపీడీఓ సోనియాబాయి, ఎంఈఓ గోపాల్‌, ఏఓనరసంహమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:42:05+05:30 IST