పాఠశాలల బంద్‌ విజయవంతం

Published: Tue, 05 Jul 2022 22:49:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠశాలల బంద్‌ విజయవంతంకాగజ్‌నగర్‌లో మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 5: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాలల బంద్‌ విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సునీల్‌, తదితరులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌ టౌన్‌: రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బందు కాగజ్‌నగర్‌లో విజయవంతమైంది. ఈ సందర్భగా విద్యార్థి సంఘం నాయకుడు మల్‌ రాజు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు, నవీన్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్‌ మండలంలో విజయవంతమైంది. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రవీణ్‌, సాయి, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కౌటాల: మండలంలో ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల బంద్‌ విజయవంతం అయింది. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసి వేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.