LIVE: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-16T15:01:08+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

LIVE: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) రెండవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం (Tammineni sitaram) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు (TDP Leaders) ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చారని... కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రాన్ని ప్రభుత్వం ప్రశ్నించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Achennaidu) అన్నారు. పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం (AP Government) దృష్టిసారించట్లేదని విమర్శించారు. వైసీపీ (YCP) పాలనలో ఏపీకి ఒక్క కొత్త పరిశ్రమ రాలేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్నా మాట్లాడడం లేదని అచ్చెన్న తెలిపారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై ప్రభుత్వం దృష్టిసారించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. మరోవైపు ఈరోజు సభలో పలు కీలక బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏబీఎన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2022-09-16T15:01:08+05:30 IST