చంద్ర శిలలు చెబుతున్న రహస్యం....

ABN , First Publish Date - 2021-10-20T23:27:59+05:30 IST

చైనీస్ రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్ గత ఏడాది తీసుకొచ్చిన

చంద్ర శిలలు చెబుతున్న రహస్యం....

న్యూఢిల్లీ : చైనీస్ రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్ గత ఏడాది తీసుకొచ్చిన చంద్ర శిలల ద్వారా కొత్త విషయాలు తెలిసినట్లు రీసెర్చర్ లీ జియాన్హువా మీడియాకు చెప్పారు. చంద్రునిపై అగ్నిపర్వత కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిందన్నారు. చంద్రుని రసాయన సమ్మేళనం, దాని అభివృద్ధిపై వేడి చూపే ప్రభావం గురించి వెల్లడైందన్నారు. 


చంద్రునిపై అగ్ని పర్వత కార్యకలాపాలు దాదాపు 2.8 బిలియన్ సంవత్సరాలు- 3 బిలియన్ సంవత్సరాల మధ్య కాలంలో ఆగిపోయినట్లు గతంలో అంచనా వేశారని, తాజాగా వచ్చిన చంద్ర శిలల శాంపుల్స్‌నుబట్టి వేసిన అంచనా ప్రకారం ఈ కార్యకలాపాలు 2 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు జరిగినట్లు తెలిసిందని చెప్పారు. చంద్రునిపై అగ్ని పర్వత కార్యకలాపాలు చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. వాటి వల్ల చంద్రుని లోపలి శక్తి, సామర్థ్యాలు తెలుస్తాయన్నారు. చంద్రుని లోపలి భాగంలో శక్తి, పదార్థం రీసైకిలింగ్‌ గురించి తెలుస్తుందన్నారు. 


చంద్రునిపై 1970వ దశకంలో అమెరికా, (అప్పటి) సోవియెట్ యూనియన్ పరిశోధనలు నిర్వహించాయి. చైనా డిసెంబరులో చంద్రుని నుంచి తొలి శిలలను తీసుకొచ్చింది. చైనా 2003లో సొంతంగా ఓ మానవుడిని రోదసికి పంపించింది. ఈ విధంగా మానవుడిని రోదసికి పంపిన సోవియెట్ యూనియన్, అమెరికా తర్వాతి దేశంగా చైనా నిలిచింది. ఓ ఆస్టరాయిడ్ నుంచి మట్టిని సేకరించాలని, చంద్రుని నుంచి మరిన్ని శాంపుల్స్‌ను తేవాలని చైనా ప్రయత్నిస్తోంది. 


Updated Date - 2021-10-20T23:27:59+05:30 IST