ఆచార్య వల్లీపాషా సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2022-07-01T05:43:17+05:30 IST

ఆచార్య వల్లీపాషా సేవలు ప్రశంసనీయమని వైవీయూ రిజిసా్ట్రర్‌ విజయరాఘవప్రసాద్‌ అన్నారు.

ఆచార్య వల్లీపాషా సేవలు ప్రశంసనీయం

కడప వైవీయూ, జూన్‌ 30: ఆచార్య వల్లీపాషా సేవలు ప్రశంసనీయమని వైవీయూ రిజిసా్ట్రర్‌ విజయరాఘవప్రసాద్‌ అన్నారు. వైవీయూలో బయోకెమిసీ్ట్ర విభాగం ప్రొఫెసర్‌ వల్లీపాషా అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ వల్లీపాషాను సన్మానించారు. ఈ కార్యక్రమానికి రిజిసా్ట్రర్‌ విజయరాఘవప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యూనివర్సిటీలో ప్రవేశించి పరిశోధకుడిగా రాణించారన్నారు. యూ నివర్శిటీ పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ వైపీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ వల్లీపాషా వైవీయూకు ఎంతో సేవ చేశారన్నారు. యూటా అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణారావు, కార్యదర్శి డాక్టర్‌ సుభో్‌సచం ద్ర, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ లలితలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రొఫసర్‌ వల్లీపాషా యూనివర్శిటీలో అందరిని కలుపుకునిపోయే వ్యక్తి అన్నారు. టీచర్స్‌ అసోసియేషన్‌ సహాయ కార్యదర్శి డాక్టర్‌ సునీత, ట్రెజరర్‌ డాక్టర్‌ గంగయ్య, సభ్యులు, బోదనేతర సిబ్బంది పాల్గొని శాలువా, పూలమాలలతో సత్కరించారు. 

Updated Date - 2022-07-01T05:43:17+05:30 IST