ఇరుపక్షాల రాజీతోనే కేసుల పరిష్కారం

Published: Sun, 14 Aug 2022 00:17:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇరుపక్షాల రాజీతోనే కేసుల పరిష్కారం పరిగి కోర్టులో కేసులను పరిష్కరిస్తున్న న్యాయమూర్తి వి.హరికుమార్‌

పరిగి, ఆగస్టు 13 : ఇరుపక్షాలు రాజీపడితేనే కేసుల విషయంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పరిగి మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి వి.హరికుమార్‌ అన్నారు. శనివారం పరిగి కోర్టులో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈమేరకు 210 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దీంతో నేరాలను నిరోధించవచ్చన్నారు. ఏపీపీవో దీపారాణి, ఏజీపీ బి.వెంకట్‌రెడ్డి, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు కె.నరేంద్రయాదవ్‌, న్యాయవాదులు బి.లింగం, సీహెచ్‌ బాలముకుందం, అందె విజయ్‌కుమార్‌; రాముయాదవ్‌, ఆనంద్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, గౌస్‌పాషా, శ్రీనివా్‌సరెడ్డిలు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.