జగజ్జననీ నమోస్తుతే

ABN , First Publish Date - 2022-09-29T05:46:39+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం జమ్మిచేడు జములమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

జగజ్జననీ నమోస్తుతే
గద్వాల పట్టణంలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో కుంకుమార్చన చేస్తున్న మహిళలు

- మహాలక్ష్మీ దేవిగా జములమ్మ అమ్మవారు

- వైభవంగా సాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

- వివిధ అలంకరణల్లో అమ్మవారి దర్శనం

గద్వాల, సెప్టెంబరు 28 : శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం జమ్మిచేడు జములమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్‌ కుర్వ సతీ ష్‌ కుమార్‌, ఈవో కవిత తొలిపూజలు నిర్వహించారు. అనంతరం అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు కుంకు మార్చన చేశారు. 


గాయత్రీ దేవి అలంకరణలో..

గద్వాల టౌన్‌ : పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లు గాయత్రీ దేవిగా భక్తుల పూజలందు కు న్నారు.  పాతహౌసింగ్‌ బోర్డులోని అన్నపూర్ణ ఆల యం,  కుమ్మరి శాతవాహన సంఘం మండపం,  భక్తమార్కండేయ స్వామి ఆలయంలో గాయత్రీ దేవి గా అమ్మవారు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకా పర మేశ్వరి,  బీరెల్లిరోడ్డు తాయమ్మ గుడిలో అమ్మ వారిని వనదుర్గాదేవిగా అలంకరించి పూజలు చేశారు. పాండురంగ శివాలయంలో చంద్రఘంట దేవిగా, వీరభద్రస్వామి ఆలయంలో సౌభాగ్యదేవిగా అమ్మ వారు పూజలందుకున్నారు. ఈ సందర్భంగా నిత్యపూ జలతో పాటు సాయంకాలం మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. 


గాయత్రీదేవిగా అంబాభవాని

గట్టు/అయిజ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గట్టు అంబాభవానీ ఆలయంలో అమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. అయిజలోని అంబాభవానీ ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవి గా భక్తుల పూజలందుకున్నారు. మహిళలు కుంకు మార్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు. 


లలితాదేవిగా వాసవీమాత

మల్దకల్‌ : మండల కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు లలితాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్దకల్‌ వీరయ్య, ఎల్కూ రు రాజేంద్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 


అన్నపూర్ణాదేవిగా దుర్గామాత

ఇటిక్యాల : ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి అంజనేయస్వామి అలయంలో ప్రతిష్ఠించిన దుర్గా మాత అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. సరస్వతీ మాత ఆలయంలో అమ్మవారు వీరలక్ష్మిగా విశేష పూజలందుకున్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అలయ మేనే జర్‌ సురేంద్రరాజు తెలిపారు. మండలంలోని మునుగాలలో ఉన్న జమ్ములమ్మ అలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదానం చేసినట్లు అలయ పూజారి ఎల్లగౌడ్‌ తెలిపారు.



Updated Date - 2022-09-29T05:46:39+05:30 IST