గొర్రెలు వస్తున్నాయ్‌..

ABN , First Publish Date - 2021-01-13T05:41:04+05:30 IST

గొర్రెల పంపిణీపై మళ్లీ ఆశలు మొదల య్యా యి.

గొర్రెలు వస్తున్నాయ్‌..
గొర్రెల మంద

- రెండో విడత పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ 

- గొర్రెల యూనిట్ల కోసం 336 మంది వాటాధనం చెల్లింపు


 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గొర్రెల పంపిణీపై మళ్లీ ఆశలు మొదల య్యా యి. గత ఏడాది వరుస ఎన్నికలతో నిలిచిపో యిన సబ్సిడీ గొర్రెల పథకంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కలెక్ట ర్లు, పశుసంవర్థకశాఖ అధికారులను ఆదేశిం చా రు. దీంతో డీడీలు చెల్లించి యూనిట్ల కోసం ఎ దురుచూస్తున్న జిల్లాలోని లబ్ధిదారులకు తాజా ప్రకటనతో ఊరట లభించింది. రెండో విడతలో ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికే యూనిట్లు ఇ స్తారా ఎంపిక చేసిన వారందరికీ పంపిణీ చే స్తారా అనే విషయంలో అయోమయం ఉంది. 

మొదటి విడతలో 8,153 యూనిట్లు..


మొదటి విడత గొర్రెల పంపిణీని అనేక అ వాంతరాలు, అరోపణల మధ్య 8,153 యూని ట్లను పంపిణీ చేశారు. మొదటి విడత గొర్రెల యూనిట్లు రీసైక్లింగ్‌లో పశు సంవర్థక శాఖ అధి కారులు సస్పెన్షన్‌కు గురికాగా యూనిట్‌ లబ్ధిదా రులు కూడా కేసుల పాలయ్యారు. రెండో విడత గొర్రెల పంపిణీలో పక్కాగా నిఘాను ఏర్పాటు చేశారు. గ్రామ, మండల స్థాయిలో నిఘా కమిటీలు వేశారు. గొర్రెల రవాణా వాహానాలకు జియో ట్యాగింగ్‌ చేశారు. ఇంతా చేసిన రెండో వి డత గొర్రెల పంపిణీ మాత్రం లబ్ధిదారులకు అం దలేదు. 2018 జూలైలో రెండో విడత పంపిణీని జిల్లా కేంద్రంలో మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌లు ప్రారంభించారు. గొర్రెల యూనిట్ల కోసం ఎంతో ఆశగా రెండవ విడతలో లబ్ధిదారులు తమ వాటాధనం చెల్లించి కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా ప్రభు త్వం నుంచి అదేశాలు రావడంతో యూని ట్లు అందుతాయని భావిస్తున్నారు.

 రెండో విడతలో 8,009 మంది లబ్ధిదారులు.. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచా యతీల పరిధిలో 190 సోసైటీల ద్వారా గొర్రెల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక చేశారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గొర్రెల పంపిణీ పథకం కోసం జిల్లాలో గతంలో 136 సోసైటీలు ఉంటే కొత్తగా 54 సోసైటీలు ఏర్పాటు చేశారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో 8,153 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో 7,518 మందికి యూ నిట్లను పంపిణీ చేశారు. రెండో విడతలో 8,009 మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చే యడానికి వాటాధనం లబ్ధిదారుల నుంచి తీసు కున్నారు. లబ్ధిదారులు తమ వాటాను చెల్లించి యూనిట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-01-13T05:41:04+05:30 IST