Ukrainianలోని ఐదు కీలక చారిత్రక నగరాలపై రష్యా సేనల గురి

ABN , First Publish Date - 2022-03-02T16:58:36+05:30 IST

ఉక్రెయిన్ దేశంలోని ఐదు కీలక నగరాలపై రష్యా సేనలు దాడిని వేగవంతం చేశాయి...

Ukrainianలోని ఐదు కీలక చారిత్రక నగరాలపై రష్యా సేనల గురి

కైవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలోని ఐదు కీలక నగరాలపై రష్యా సేనలు దాడిని వేగవంతం చేశాయి. ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడి ప్రారంభించిన రష్యా ఆ దేశంలోని కైవ్, ఖార్కివ్, ఖెర్సన్, బెర్డియాన్స్క్, మారియుపోల్ నగరాలపై దృష్టి కేంద్రీకరించింది. కైవ్, ఖార్కివ్ నగరాలపై రష్యా బాంబు దాడులు చేసింది. ఖార్కివ్ లో రష్యా జరిపిన బాంబు దాడిలో 11మంది మరణించారు. ఐదు ప్రధాన నగరాలపై రష్యా సైనిక దాడులతో ఆయా నగరాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యంతో పాటు అభివృద్ధి చెందిన ఐదు నగరాలు రష్యా సేనల దాడులతో దెబ్బతిన్నాయి.




చారిత్రక రాజధాని కైవ్‌పై రష్యా సేనల దాడి

ఉక్రెయిన్ రాజధాని కైవ్ అతిపెద్ద నగరం. చారిత్రక రాజధాని అయిన కైవ్ పురాతన చర్చీలు, మఠాల బంగారు గోపులకు ప్రసిద్ధి చెందింది. 2.9 మిలియన్ల జనాభా ఉన్న కైవ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది.మైదాన్ అని ప్రసిద్ధి చెందిన కైవ్ యొక్క విస్తారమైన సెంట్రల్ ఇండిపెండెన్స్ స్క్వేర్ ఆరెంజ్ రివల్యూషన్ కు కేంద్రంగా మారింది.సెంట్రల్ కైవ్ సమీపంలోని టెలివిజన్ టవర్‌పై రష్యా దళాలు జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని ఉక్రేనియన్ అత్యవసర సేనలు తెలిపాయి.రష్యన్ సైనిక కాన్వాయ్ కైవ్‌కు చేరుకోవడంతో రాజధాని ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.




నదుల సంగమం...ఖార్కివ్‌పై రష్యా గురి 

ఉక్రెయిన్ దేశంలోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్. ఉడా, లోపాన్, ఖార్కివ్ నదుల సంగమం వద్ద ఉంది.1654వ సంవత్సరంలో ఖార్కివ్ కోటగా వెలసిన ఈ నగరం రష్యన్ సామ్రాజ్యంలో పరిశ్రమ, వాణిజ్యంలో ముందుంది. ఉక్రేనియన్ల సంస్కృతికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఖార్కివ్ నగరంపై రష్యన్లు గురి పెట్టి దాడులకు దిగారు. పెద్ద రైలు జంక్షన్, ట్రంక్ లైన్లు ఉన్న ఖార్కివ్ కమ్యూనికేషన్ కేంద్రంగా ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఖార్కివ్ నుంచి మాస్కో, కైవ్, జపోరిజ్జియా, క్రిమియా, రోస్టోవ్ నాడోను, కాకసస్ లకు హైవేలున్నాయి. ఖార్కివ్ లో ప్రధాన విమానాశ్రయం కూడా ఉంది. రష్యన్ క్షిపణలు ఖార్కివ్ లోని ఫ్రీడం స్క్వేర్ లోని ఒపెరాహౌస్, కచేరీ హాలు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశాయి.ఈ క్షిపణి దాడిలో 10 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు.




అంధకారంలో మారియుపోల్

ఆగ్నేయ ఉక్రెయిన్ లోని మారియు పోల్ ప్రాంతీయ ప్రాముఖ్యత కల నగరంగా పేరొందింది.ఈ నగరం ప్రయాజోవియా ప్రాంతంలోని కల్మియస్ నది ముఖద్వారం వద్ద అజోవ్ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉంది.క్రౌన్ ప్రిన్స్ పాల్ రెండవ భార్య మరియా ఫ్యోడోరోవ్నా గౌరవార్థం 1779లో దీనికి మారియుపోల్ అని పేరు మార్చారు.రష్యా సైనికులు మారియుపోల్ నగరంపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ నగరంలో రష్యా దాడులతో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతోంది.




ఓడరేవు నగరం...బెర్డియాన్స్క్

ఓడరేవు నగరంగా పేరొందిన బెర్డియాన్స్క్ ప్రధాన సిటీ.ఈ నగరం అజోవ్ సముద్రం బెర్డియాన్స్ గల్ఫ్ వెంట ఉంది. బెర్డియాన్స్క్ నౌకాశ్రయం రష్యా సేనల దాడులతో పడిపోయిందని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.లక్షమంది జనాభా ఉన్న బెర్డియాన్స్క్ ఓడరేవు నగరం బొగ్గు, ధాన్యం, పొద్దుతిరుగుడు-విత్తనాల నూనె, ఇనుము, ఇతర వస్తువుల ఎగుమతులకు కేంద్రంగా ఉంది.

ఖేర్సాన్ నగరంపై రష్యా దళాల ముట్టడి

ఉక్రెయిన్ దేశంలోని పశ్చిమ ఒడ్డున ఉన్న ఖేర్సాన్ వ్యూహాత్మక నౌకాశ్రయ నగరంగా పేరొందింది. డ్నీపర్ నది ఒడ్డున ఉన్న ఈ నగరం క్రిమియన్ ద్వీపకల్పం మార్గంలో ఉంది. 1778వ సంవత్సరంలో నల్లసముద్రం ముఖభాగాన్ని రక్షించడానికి కోటగా ఈ ఖేర్సాన్ నగరాన్ని నెలకొల్పారు.నల్ల సముద్రంలోని మొదటి రష్యన్ నావికా స్థావరం మరియు షిప్‌యార్డ్‌గా మారింది.షిప్పింగ్ మరియు నౌకానిర్మాణం కారణంగా 19వ శతాబ్దంలో నగరం స్థిరంగా అభివృద్ధి చెందింది. ఖేర్సాన్ నగరం ప్రధాన నౌకానిర్మాణ కేంద్రంగా కొనసాగుతోంది. 



Updated Date - 2022-03-02T16:58:36+05:30 IST