భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు.. అయితే వారే చివరికి ఇలా చేస్తారనుకోలేదు..

Published: Sat, 25 Dec 2021 16:58:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు.. అయితే వారే చివరికి ఇలా చేస్తారనుకోలేదు..ప్రతీకాత్మక చిత్రం

కొందరు భార్యపై గౌరవంతోనో, భయంతోనో.. తమకున్న ఇష్టాయిష్టాలను అనచిపెట్టుకుని ఉంటారు. కొందరికి మందుతాగడం, మరికొందరికి జూదం ఆడడం వంటి అలవాట్లు ఉన్నా.. వాటిని అదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే భార్య లేని సమయంలో అలాంటి వారు తమకు ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కర్నాటకలో ఓ వ్యక్తి.. భార్య పుట్టింటికి వెళ్లగానే, తన సరదాలను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన స్నేహితులను ఇంటికి పిలిచి, పార్టీ ఇచ్చాడు. తర్వాత జరిగిన పరిణామాలతో అంతా షాక్ అయ్యారు.. వివరాల్లోకి వెళితే..

కర్నాటక శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా రిప్పన్‌పేట సమీపంలోని గరతికెరె గ్రామంలో సతీశ్(32) కుటుంబం నివాసం ఉంటోంది. భార్యపై గౌరవమో, భయమో తెలీదుగానీ తన అలవాట్లను బయటపెట్టేవాడు కాడు. కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేకున్నా.. అతడి చెడు అలవాట్ల కారణంగానే అనుకోని ఘటన చోటు చేసుకుంటుందని ఊహించలేకపోయాడు. గత బుధవారం సతీశ్ భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

తన ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి, ఇంటికి రమ్మని పిలిచాడు. బుధవారం రాత్రి ముగ్గురూ కలిసి సతీశ్ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్‌గా మద్యం తీసుకోవడంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. వారికే అర్థం కాలేదు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు స్నేహితులు.. సతీశ్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో సతీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలోని చెరువులో పడేశారు. మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు.. తన ఇంటి విలువ రూ.3.6కోట్లు.. ఎలా సాధ్యమైందో తెలుసా..పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకున్నారు... మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుకు వెళితే.. అక్కడ ఊహించని సీన్..అర్ధరాత్రి రోడ్డుపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తాను పోలీసునంటూ యువతిపై సెల్ లైట్ వేసి.. చివరకు..స్మార్ట్‌ఫోన్‌కు బ్యాండు బాజాల మధ్య.. గుర్రపు బండిపై ఊరేగింపు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..video65ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం.. ఉన్నట్టుండి మహిళ అదృశ్యం.. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని..పెళ్లయి నెల కూడా కాకముందే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త బలవన్మరణం.. షాకింగ్ నిజాలు చెప్పిన మరిది
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.