
విద్యాబుద్ధులు నేర్పించార్పించాల్సిన గురువుల్లో కొంతమంది సైకోలు కూడా ఉంటారు. బాలికల పట్ల అసభ్యకరంగా కొందరు ప్రవర్తిస్తుంటే.. మరికొందరు వారితో చేయించరాని పనులన్నింటినీ చేయిస్తుంటారు. తమిళనాడులో ఓ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం సంచలనమైంది. బాలికలని కూడా చూడకుండా ఆమె ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు తిరుప్పూరు జిల్లాలోని ఉన్నత పాఠశాలలో గీత అనే మహిళ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి యోగక్షేమాలు చూసుకోవాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. కొన్ని రోజులుగా ఆమె.. విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తున్నారు. దళిత విద్యార్థినులను కులం పేరుతో దూషించడంతో పాటూ వారితో బాత్రూంలను కూడా కడిగించేది. పనులు చేయించడంతో పాటూ తక్కువ జాతి వారికి చదువులు ఎందకని మాట్లాడుతుండడంతో బాలికలు తీవ్ర మనస్థాపానికి గురయ్యేవారు.

అయినా బయటికి చెప్పకుండా లోలోపలే బాధపడుతూ.. చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చేవారు. అయితే ఇటీవల బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆఖరికి మగ పిల్లల బాత్రూంలు కూడా కడిగించేవారని వారు అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ గీతను విధుల నుంచి తొలగించిన అధికారులు.. పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి