నిద్రపోతున్న బాలిక మెడకు చుట్టుకున్న పాము.. గంటన్నర పాటు టెన్షన్ టెన్షన్.. చివరకు..

ABN , First Publish Date - 2021-09-16T23:29:46+05:30 IST

నిద్రపోతున్న బాలిక మెడకు చుట్టుకున్న పాము.. ఆ తరువాత..

నిద్రపోతున్న బాలిక మెడకు చుట్టుకున్న పాము.. గంటన్నర పాటు టెన్షన్ టెన్షన్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్:  అది అర్ధరాత్రి.. ఇంట్లో అంతా నిశ్శబ్దం..ఆరేళ్ల పాపేమో తన తల్లి పక్కనే నేలపై హాయీగా పడుకుని నిద్రపోతోంది. ఇంతలో ఓ పాము వచ్చి చిన్నారి మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో మెలకువ వచ్చిన తల్లి.. పామును గమనించిన గాబరాలో అక్కడి నుంచి తప్పించుకుంది. అది మొదలు.. ఆ ఇంట్లో గంటన్నర పాటు నరాలు తెగే ఉత్కంఠ రాజ్యమేలింది. బిడ్డకు ఏమవుతుందోనని కంగారు పడిపోయిన మహిళ..కుటుంబసభ్యులతో పాటూ చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేసింది. కానీ.. చిన్నారికి అపాయం కలగకుండా పామును ఎలా పట్టుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. 


అక్కడున్న వారు.. కదలకుండా పడుకోమని బిడ్డకు చెప్పి తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పాము చిన్నారిని కాటేస్తుందేమోనని తల్లిదండ్రులు క్షణమొక యుగంలా గడిపారు. అయితే..గంటన్నర తరువాత పాము దానంతట అదే పక్కకు వెళుతుండగా ఆ చిన్నారి కదలడంతో దాని తోక నలిగింది. దీంతో..పాము చిన్నారిని కాటు వేసింది. అయితే..అపాయం జరిగేలోపే చుట్టుపక్కల వారు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. అపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇవీ చదవండి:

బాలుడి ఖాతాలో రూ.905 కోట్లు! తండ్రికి మైండ్ బ్లాక్..


గాడిద పాలతో సబ్బుల తయారీ.. భారీగా లాభాలు...


మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సెలూ తాలూకాలో ఇటీవల జరిగిందీ ఘటన. ఆ ప్రాంతంలో పాముల బెడద అధికమేనని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వానాకాలంలో సమస్య మరింత తీవ్రమవుతుందని వాపోయారు. ఇటీవల అదే గ్రామంలోని ఒక ఇంట్లో ఏకంగా 98 పాములు బయటపడ్డాయి. ఓ డ్రమ్ములో అవి దాగున్నట్టు వెలుగులోకి రావడంతో స్థానికంగా పెద్ద కలకలమే రేగింది. 

Updated Date - 2021-09-16T23:29:46+05:30 IST