అక్కడంతే.. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని, గాడిద మీద ఊరేగిస్తారట.. చివరగా వారు చేసే పనేంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-03-17T01:24:22+05:30 IST

మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ విచిత్ర ఆచారం కొనసాగుతోంది. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని గాడిదపై ఊరేగిస్తారట. అనంతరం బంధువులంతా కలిసి చేసే పనేంటో తెలుసుకుందాం..

అక్కడంతే.. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని, గాడిద మీద ఊరేగిస్తారట.. చివరగా వారు చేసే పనేంటో తెలుసా..

ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు మారుతుంటాయి. కొన్ని చోట్ల వింత వింత ఆచారాలు ఉండడం చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు.. అరే! ఇదేం ఆచారం అంటూ ముక్కున వేలేసుకుంటూ ఉంటాం. కొన్ని వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్కడి వారు మాత్రం ఆ ఆచారాలను సాధారణంగా జరిగే తంతుగానే పరిగణిస్తారు. ఇక వివిధ ప్రాంతాల్లో, వివాహ సందర్భాల్లో పాటించే సంప్రదాయాలు, ఆచారాలను చూసినప్పుడు.. కొన్ని విచిత్రంగా అనిపిస్తే.. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ విచిత్ర ఆచారం కొనసాగుతోంది. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని గాడిదపై ఊరేగిస్తారట. అనంతరం బంధువులంతా కలిసి చేసే పనేంటో తెలుసుకుందాం.. 


మహరాష్ట్రలోని బీడ్ జిల్లా పరిధి.. కేజ్ తహసీల్ పరిధిలోని విదా గ్రామంలో ఈ సంప్రదాయాన్ని 90 ఏళ్లుగా పాటిస్తున్నారు. సాధారణంగా వివాహానంతరం కొత్త అల్లుడిని ఆట పట్టించడం మామూలే. అయితే విదా గ్రామంలో మాత్రం కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రతి ఏడాదీ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోలీని ఇక్కడ ధులంది పేరుతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామదహనం తదితర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారట. ఇదిలావుండగా, ఈ పండుగ వచ్చిందంటే చాలు.. కొత్త అల్లుళ్లు గ్రామం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తారట.

అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ డోర్ కొట్టిన కూతురు.. ఎంతకీ తీయకపోవడంతో వెనుక డోర్ నుంచి వెళ్లగా..


అయితే పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే.. బంధువులంతా అల్లుళ్లపై ఓ కన్నేసి ఉంచుతారట. పండుగకు ఒక రోజు రోజు ముందు కొత్త అల్లుడిని ఎక్కడికీ పారిపోకుండా బంధిస్తారు. పండుగ రోజు రాగానే గాడిదపై కూర్చోబెట్టి, డప్పు వాయిద్యాల మధ్య ఊరంతా ఊరేగింపు నిర్వహిస్తారట. చివరగా గ్రామం మధ్యలో ఉన్న ఆలయానికి తీసుకెళ్లి, కొత్త దుస్తులు పెడతారట. ఇక్కడితో ఉత్సవం ముగుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పండుగను మొదటిసారిగా గ్రామానికి చెందిన ఆనందరావ్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ప్రారంభించారట. అప్పటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ పండుగను ఘనంగా చేసుకోవడం.. సంప్రదాయంగా వస్తోందని గ్రామపెద్దలు చెబుతున్నారు.

బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి.. అంటూ స్నేహితులకు ఫోన్.. చివరకు ఇంటికి చేరుకున్న బాలిక ఇలా చెప్పడంతో..

Updated Date - 2022-03-17T01:24:22+05:30 IST