అత్తను హత్య చేసిన అల్లుడు అరెస్టు

ABN , First Publish Date - 2021-03-06T04:52:10+05:30 IST

అత్తను హత్య చేసిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అత్తను హత్య చేసిన అల్లుడు అరెస్టు
నిందితుని అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న సీఐ విశ్వనాధరెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 5 : అత్తను హత్య చేసిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 2న గ్రేసమ్మ అనే మహిళ హత్యకు గురికాగా, ఆ కేసుకు సంబంధించి మృతురాలి రెండో అల్లుడు సూరిబాబును శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ విశ్వనాధరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావే శంలో వెల్లడించారు. ప్రొద్దుటూరు వివేకానందకాలనీకి చెందిన గ్రేసమ్మ శంకరాపురంలో ఉంటున్న పెద్దకుమార్తె చింతమాను శాంతమ్మ వద్ద ఉండేది. ఇటీవల నక్కలదిన్నెలో ఉంటున్న రెండో కుమార్తె మరియమ్మ ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణం లో బైక్‌లో అల్లుడు సూరిబాబుతో కలిసి వెళ్లిన గ్రేసమ్మ శవమై కన్పించింది. అప్పటి నుంచి సూరిబాబు కన్పించకపోవడం, అతని సెల్‌ఫోన్‌ స్విచ్డ్‌ఆఫ్‌ ఉండటంతో అతనే చంపి ఉంటాడని నిర్దారణకు వచ్చినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణలో భాగంగా శుక్రవారం సూరిబాబును అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. గ్రేసమ్మ పెద్దకుమార్తెను, వారి పిల్లలను చూసుకున్నట్లు తన భార్యాపిల్లలను చూడటం లేదనే ఆమెతో గొడవ పడి గొంతుపిసికి హత్య చేసినట్లు సూరిబాబు నేరం ఒప్పుకున్నాడన్నారు. ఈ మేరకు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్‌ రిమాండుకు అదేశించినట్లు సీఐ విశ్వనాధరెడ్డి తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ లక్ష్మినారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T04:52:10+05:30 IST