దక్షిణ ప్రాంతం అతలాకుతలం

ABN , First Publish Date - 2021-12-01T07:05:25+05:30 IST

జిల్లా దక్షిణప్రాంతం సోమవారం రాత్రి కురిసిన వర్షాలతో అతలాకుతలమైంది.

దక్షిణ ప్రాంతం అతలాకుతలం
మాచవరం బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మన్నేరు

నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు మండలాల్లో భారీ వర్షం 

పొంగిన  వాగులు, రవాణాకు తీవ్ర అంతరాయం

మోపాడు, రాళ్లపాడుకు వెల్లువెత్తిన వరద

తుడిచిపెట్టుకుపోతున్న పంటలు

తల్లడిల్లుతున్న రైతులు

కుండపోత వానతోపాటు పైనుంచి వరదతో జిల్లాలోని దక్షిణ ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతోపాటు.. నెల్లూరు, కడప జిల్లాల నుంచి వస్తున్న ప్రవాహంతో అన్ని వాగులూ ప్రమాదకరంగా పారుతున్నాయి. జలవనరులన్నీ నిండిపోయాయి. అక్కడక్కడా  చెరువులకు గండ్లు పడే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 25ఏళ్ల తర్వాత జిల్లాలోని ప్రధానమైన మోపాడు రిజర్వాయర్‌ నిండింది. అలుగు పారుతోంది. అలాగే కీలకమైన రాళ్లపాడు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మన్నేరుకు 44వేల క్యూసెక్కుల నీటిని వదులు తుండటంతో అది ఉధృతంగా పారు తోంది. అలాగే పలు వాగుల కారణంగా కీలక రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలపై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిం దేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఒంగోలు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా దక్షిణప్రాంతం సోమవారం రాత్రి కురిసిన వర్షాలతో అతలాకుతలమైంది. నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండి అలుగులు పారాయి. జిల్లాలో మంగళవారం ఉదయానికి 24గంటల వ్యవధిలో సగటున 17.8మి.మీ వర్షపాతం నమోదైంది. కందుకూరు, కనిగిరి, గిద్దలూరు కొండపి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భారీ వర్షమే కురి సింది. అత్యధికంగా పామూరు మండలంలో 177.4 మి.మీ వర్షపా తం నమోదైంది. సీఎస్‌పురంలో 109.4, వెలిగండ్లలో 102.2, లింగస ముద్రంలో 82.0, కొమరోలులో 78.4, వీవీపాలెంలో 62.8, పీసీపల్లి లో 60.2, గిద్దలూరు 53.8, గుడ్లూరులో 45.4, రాచర్లలో 38.6మి.మీ కురిసింది. ఉలవపాడు, కందుకూరు, సింగరాయకొండ, బేస్తవార పేట మర్రిపూడి, పొన్నలూరు తదితర మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇప్పటికే పక్షంరోజులుగా ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా కురిసిన వర్షపు నీరు వాగులు, వంకలు, చెరువులకు చేరింది. దీనికితోడు ఆ ప్రాంతానికి ఎగువన ఉన్న నెల్లూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీవర్షాలతో దిగువకు వరద పోటెత్తింది. దీంతో  దక్షిణ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, ప్రాజెక్టులకు భారీగా నీరు చేరింది. 

నిండిన మోపాడు, రాళ్లపాడు

మోపాడు రిజర్వాయర్‌ 25 ఏళ్ల తర్వాత నిండింది. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 29 అడుగులు కాగా మంగళవారం మధ్యాహ్నానికి పూర్తిగా నిండింది. ఎగువ నుంచి నీరు చేరుతూ అలుగు పారుతోంది. ఇక రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తిగా నిండగా ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తోంది. సుమారు 41వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 43వేల క్యూసెక్కుల నీటిని ఐదు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. అలా భారీ ప్రవాహాన్ని దిగువకు వదలడంతో ఆనీరు ప్రవహించే మన్నేరుకు వరద పోటెత్తింది. దీంతో గుడ్లూరు-మాచవరం మధ్య బ్రిడ్జిపై భారీగా నీరు ప్రవహిస్తోంది. దీంతో కందుకూరు-కావలి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కందుకూరు-పామూరు మార్గంలో మాలకొండ- బొట్లగుడూరు మధ్య నేరెళ్లవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కందుకూరు- పామూరు మధ్యనే కాక ఆ మార్గంలోని కడప, పొద్దుటూరు, బెంగళూరు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. లింగసముద్రం మండలం పెద్దపవని వద్ద ఉప్పుటేరు పొంగి ఆమార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బట్టుపల్లి వద్ద పాలేరు పొంగడంతో పీసీపల్లి-కనిగిరి మార్గంలో రవాణాకు ఆటంకం ఏర్పడింది. సీఎస్‌పురం మండలంలోని బైరవకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. పామూరు, వెలిగండ్ల, సీఎస్‌పురం మండలాల్లో పలు వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. గిద్దలూరు ప్రాంతంలో కురిసిన భారీవర్షాలతో సగిలేరు, ఎనుమలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, కొమరోలు మండలంలో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

 ప్రమాదకరంగా పెద్ద చెరువులు

Updated Date - 2021-12-01T07:05:25+05:30 IST