సిబ్బంది ఆకలి కేకలు

Sep 20 2021 @ 01:00AM
బనవాసి నవోదయ కేంద్రం వద్ద ఎంపీడీవోతో వాగ్వివాదం చేస్తున్న ఎన్నికల సిబ్బంది

అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు


ఎమ్మిగనూరు టౌన్‌, సెప్టెంబరు 19: మండల పరిధిలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. తాగునీరు, టిఫిన ఏర్పాటు చేయకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. షుగర్‌, బీపీ, ఇతర జబ్బులతో ఇబ్బందులు పడేవారు టిఫిన లేకపోతే ఎలా విధులు నిర్వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో బంగారమ్మతో వాగ్వాదానికి దిగారు. ఎంపీడీవో డౌన డౌన అంటూ సిబ్బంది నినాదాలు చేశారు. ఈ విషయంపై ఎంపీడీవో మాట్లాడుతూ ఉదయమే ఎన్నికల సిబ్బందికి టిఫిన తెప్పించామని, బయట వ్యక్తులు వచ్చి టిఫిన చేసి వెళ్లిపోయారని, మళ్లీ టిఫిన తెప్పించామని అన్నారు. రెండోసారి టిఫిన తెప్పించినా ప్లేట్ల కొరత ఏర్పడింది. దీంతో ఒకే ప్లేట్‌లో ఇద్దరు, ముగ్గురు టిఫిన చేస్తూ కనిపించారు. మరికొంతమంది టిఫిన చేయకుండా ఆకలితోనే విధులు నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఓ ఉద్యోగిని కన్నీటిపర్యంతమయ్యారు. టిఫిన సౌకర్యం లేదని తెలియజేసుంటే ఉదయమే ఇంటి వద్ద తిని వచ్చేవాళ్లం కదా అని వాపోయారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. 



బనవాసి నవోదయ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న ఎన్నికల సిబ్బంది


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.