కేంద్ర పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-07-02T06:41:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథ కాలను రాష్ట్రంలో అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర విమానయాన, రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ అన్నారు.

కేంద్ర పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు, గోపయ్యచారి చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న కేంద్ర విమానయాన, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌

సూర్యాపేట సిటీ, ఆత్మకూర్‌(ఎస్‌), జూలై 1:కేంద్ర ప్రభుత్వ పథ కాలను రాష్ట్రంలో అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని  కేంద్ర విమానయాన, రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని 18వ వార్డులో, ఆత్మకూరు(ఎస్‌) మండలం  తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామంలో నిర్వహించిన శక్తికేంద్రాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ  ప్రవేశపెట్టిన 114 సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాల్లో  అమలు అవుతుంటే తెలంగాణలో  సీఎం కేసీఆర్‌ వాటిని  అమలు చేయడంలేదన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.25వేల వరకు అందించే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను, రూ.5లక్షల  వరకు ఉచిత వైద్యం అందించే అయుష్మాన్‌ భారత్‌, ఈ-శ్రమ్‌ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడం విచారకరమన్నారు.  కేంద్ర ప్రభుత్వం దేశం కోసం పని చేస్తుంటే సీఎం కేసీఆర్‌ కేవలం తన కుటుంబం సంపద పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో ఈనెల మూడో తేదీన నిర్వహించే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయని సీఎం కేసీఆర్‌ మరో సారి మోసపు మాటలతో అధికారంలోకి రావడానికి యత్నిస్తున్నారని అన్నారు. ముందుగా  సూర్యాపేట కోర్టు చౌరస్తాలో దివంగత కల్నల్‌ సంతోష్‌బాబు విగ్రహం వద్ద సంతోష్‌బాబు, గోపయ్యచారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు  వీకే సింగ్‌కు  వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్‌, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్‌, నాయకులు పల్సా మల్సూర్‌ గౌడ్‌, సంధ్యాల సైదులు, మీర్‌ అక్బర్‌, వల్దాస్‌ ఉపేందర్‌   పందిరి రాంరెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, కాప రవి, ఉపేందర్‌రెడ్డి, వరుణ్‌రావు, అబిద్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

‘తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌  ప్రభుత్వం రావాలి’ 

హుజూర్‌నగర్‌ రూరల్‌:  తెలంగాణాలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం (కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ) రావాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ చాహర్‌ కోరారు. హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలో  మూఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం     పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు.     తెలంగాణలో రామరాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.  హుజూర్‌నగర్‌లో పేకాట క్లబ్‌లు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, నల్లబెల్లం మాఫియా ఉందని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చివేశారని అన్నారు. హుజూర్‌నగర్‌ను త్వరలోనే పోంచర్లగా మారుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలో పలు వురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి  ఆహ్వానించారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యారెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, ముస్కుల చంద్రారెడ్డి, తోట శేషుబాబు, కోటిరెడ్డి, ఉమమహేశ్వరరావు, రామరాజు, వీరబాబు, నరేష్‌, గోపి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఉదయం బీజేపీ కార్యకర్త రామరాజు నివాసంలో అల్పాహారం చేశారు.

సీఎం కేసీఆర్‌ అవినీతిని బయటకు తీస్తాం: ఎంపీ

తిరుమలగిరి: సీఎం కేసీఆర్‌ అవినీతిని బయటకు తీస్తామని   హర్యానా రాష్ట్ర  సిర్సా బీజేపీ ఎంపీ  సునితా దుగ్గల్‌ అన్నారు. తిరుమల గిరిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన శక్తికేంద్ర సమావేశంలో ఆమె మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో ఏఒక్క వర్గమూ సంతోషంగా లేదని, ఒక్క కేసీఆర్‌ కుటుంబమే సంతోషంగా ఉందన్నారు. ఎంతోమంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.  మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని  రూ.5.72లక్షల అప్పుల ఊబిలోకి సీఎం కేసీఆర్‌ తీసుకువె ళ్లారన్నారు కమీషన్ల కోసమే  ప్రాజెక్టులు  చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ అవినీతి, నిరంకుశ, కుటుంబ పాలన అంతంచేయడం బీజేపీతోనే సాధ్యమ న్నారు.  అనంతరం మునిసిపాలిటీ కేంద్రంలోని  దళితుల ఇంట్లో  భోజనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, శక్తికేంద్రం రాష్ట్ర పరిశీలకుడు ఈగ మల్లేషం, జిల్లా కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, ఎస్పీ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి కడియం కల్యాణ్‌, చంద్రశేఖర్‌, మూల వెంకట్‌రెడ్డి, బంగారి, మేడబోయిన యాదగిరి, ఇమ్మడి వెంకటేశ్వర్లు, చిరంజీవి,  కడియం సోమన్న, పగిళ్ల శేఖర్‌, రమేష్‌, మహెందర్‌, బాలకృష్ణ, సంతోష్‌, పాల్గొన్నారు.

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి: ఎంపీ

అర్వపల్లి: హైదరాబాద్‌లో ఈనెల మూడో తేదీన నిర్వహించే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఎంపీ సునితాదుగ్గల్‌ కోరారు.  మోదీ సభ విజయవంతం కావాలని కోరుతూ అర్వపల్లిలోని సాయిబాబా దేవాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్ర మంలో ఆమె పాల్గొని మాట్లాడారు.  కార్యక్రమంలో  బీజేపీ మండల అధ్యక్షుడు పగిళ్ల  శంకర్‌, పాక వీరేష్‌యాదవ్‌, శంకర్‌, రాములు, దుశ్యంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, జనార్దన్‌, అశ్విని, సాయిరాం పాల్గొన్నారు.






Updated Date - 2022-07-02T06:41:56+05:30 IST