అసమర్థ పాలనతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం

ABN , First Publish Date - 2022-07-05T06:34:31+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అసర్ధ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ మండల అధ్యక్షులు పొద వీరయ్య, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ కార్యదర్శి బత్తుల శ్రీనివాసరావులు అన్నారు.

అసమర్థ పాలనతో అప్పుల ఊబిలోకి  రాష్ట్రం
బాదుడే బాదుడు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

అసమర్థ పాలనతో అప్పుల ఊబిలోకి  రాష్ట్రం

చినగంజాం, జూలై 4 : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అసర్ధ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ మండల అధ్యక్షులు పొద వీరయ్య, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ కార్యదర్శి బత్తుల శ్రీనివాసరావులు అన్నారు. మండలంలోని గొనసపూడి గ్రామంలో సోమవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పొద శేషగిరిరావు అధ్వర్యంలో గ్రామ పురవీధులలో నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినా ఏ ఒక్క సామాజిక వర్గ ప్రజలు సంతోషంగా లేరని వీరయ్య అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంట్‌ బిల్లులు, బస్సు చార్జీలు, గ్యాస్‌ ధరలు బాదుడే బాదుడుతో సామాన్య ప్రజానీకం కొనలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు, దౌర్జన్యకారులు, దందాలు చేసేవారు తప్ప మరి ఎవరు బాగుపడలేదన్నారు. ఏ ప్రభుత్వ హయంలో ప్రజలకు మేలు జరగిందో ఆలోచించి రాబోయే ఎన్నకల్లో మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ జగన్‌ పాలనలో ‘కరెంటు, బస్సు చార్జీలు బాదుడే బాదుడు ’ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండ్రగుంట శ్రీహరి, నీలాయపాలెం గ్రామ సర్పంచ్‌ తూమాటీ శ్రీనివాసరావు, నాయకులు విక్రం వెంకట్రావు, దావులూరి రమేష్‌, పొద హను మంతరావు, అఖిల్‌, శ్యామ్‌, జీవన్‌, మాజీ సర్పంచ్‌ ఏఫ్రాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:34:31+05:30 IST