Viral Video: అరె! ఇతడేంటి.. సైకిల్ మీద మరీ ఇలా విన్యాసం చేస్తున్నాడు..
ABN , First Publish Date - 2022-03-09T23:46:46+05:30 IST
వాహనాలతో విన్యాసాలు చేసే వ్యక్తులకు సంబంధించిన వీడియోలను తరచూ చూస్తుంటాం. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురవుతుంటాం. కొందరు చేసే విన్యాసాలైతే అనితరసాధ్యం..
వాహనాలతో విన్యాసాలు చేసే వ్యక్తులకు సంబంధించిన వీడియోలను తరచూ చూస్తుంటాం. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురవుతుంటాం. కొందరు చేసే విన్యాసాలైతే అనితరసాధ్యం అనిపించేలా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి సైకిల్ మీద చేసే విన్యాసం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సైకిల్ హ్యాండిల్ మీద నిలబడి ఇతడు చేసిన విన్యాసం చూసి.. నెటిజన్లు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి చిన్నపిల్లల సైకిల్ హ్యాండిల్‌పై నిలబడి రావడం వీడియోలో చూడొచ్చు. హ్యాండిల్‌పై నిలబడడమే కష్టమనుకుంటే.. దాన్ని చాకచక్యంగా బ్యాలెన్స్ చేయడమే కాకుండా అటూ ఇటూ తిరగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెద్ద గుంత పక్కనే అతడు చేసే విన్యాసం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఏమాత్రం పట్టుతప్పినా గుంతలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇతడు మాత్రం పట్టు తప్పకుండా కాళ్లతో సైకిల్ నడపడం.. చూపు తిప్పుకోకుండా చేస్తుంది. సైకిల్ తోలే క్రమంలో ఎక్కడ కిందపడిపోతాడో అనిపించినా చివరకు ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా వెళ్తాడు. చివరలో సైకిల్ నుంచి నేలపైకి ఒక్క జంప్ చేసి.. తన స్టంట్‌ని ముగిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.