
జంతువులు ఒక్కోసారి వింత వింతగా ప్రవర్తిస్తుంటాయి. చింపాంజీలు, కోతులు, కుక్కలు తదితర జంతువులు చేసే విన్యాసాలు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ఇళ్లల్లో పెంపుడు పిల్లలు ఎంత అల్లరి చేస్తుంటాయో అందరికీ తెలుసు. పిల్లులకు సంబంధించిన వీడియోలు కూడా ఎంతో ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం గాల్లోకి ఎగిరి పిల్లి చేసిన స్టంట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో పెంపుడు పిల్లి బంతితో ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఇంటి యజమాని.. పిల్లికి ఓ పరీక్ష పెడతాడు. బొమ్మను విసిరితే క్యాచ్ పడుతుందో, లేదో అని టెస్ట్ చేస్తాడు. బంతితో ఆడుకుంటూ పిల్లి బిజీగా ఉన్న సమయంలోనే ఒక్కసారిగా బొమ్మను అటుగా విసురుతాడు. అయినా ఆ పిల్లి వెంటనే అప్రమత్తమవుతుంది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి, చక్కర్లు కొడుతూ బొమ్మను పట్టుకుంటుంది. సినిమాలో చూపించే స్టంట్స్‌ని తలదన్నేలా ఈ పిల్లి చేసిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి