సూక్ష్మనీటి సేద్యపు పరికరాలపై రాయితీని పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2021-10-25T05:11:40+05:30 IST

సూక్ష్మనీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్రాలపై రాయితీని పునరుద్ధరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ, ప్రధాన కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు.

సూక్ష్మనీటి సేద్యపు పరికరాలపై రాయితీని పునరుద్ధరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం నాయకులు

ఏపీ రైతు సంఘం నాయకులు వెల్లడి


కడప(రవీంద్రనగర్‌), అక్టోబరు 24: సూక్ష్మనీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్రాలపై రాయితీని పునరుద్ధరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ, ప్రధాన కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు తక్కువ నీటితో పంటలు పండించే ఇజ్రాయిల్‌ టెక్నాలజీ బిందు తుంపర సేద్యం సంజీవినిలా ఉపయోగపడిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో కంపెనీలకు చెల్లించాల్సిన రూ.1300 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో 37 కంపెనీలు సూక్ష్మనీటి సేద్యపు పరికరాల సరఫరాను నిలుపుదల చేశాయన్నారు. తక్షణం సూక్ష్మనీటి సేద్యపు వ్యవసాయ యంత్రాలపై రాయితీని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నవంబర్‌ 8న ఏపీ రైతు సంఘం తలపెట్టిన చలో గుంటూరు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శివశంకర్‌రెడి ్డ, మేకల జయన్న, చంద్రశేకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:11:40+05:30 IST