సంక్షేమ పథకాలు, సమష్టి కృషి వల్లే వైసీపీ విజయం

Sep 21 2021 @ 00:55AM
పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో గణేశ్‌

  ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం, సెప్టెంబరు 20 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషివల్లే ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధ్యమైందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు. సోమవారం విజయం సాధించిన ఎంపీటీసీలు, ముగ్గురు జడ్పీ టీసీలను పార్టీ కండువాలు, శాలువా లతో సత్కరించి అభినందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత కష్టపడి పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు అంకంరెడ్డి జమీలు, లెక్కల సత్యనారాయణ, చిటికెల భాస్కరనాయుడు, సునీల్‌, సుర్ల సత్యనారాయణ, రుత్తల సత్యనారాయణ, శెట్టి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.